- Home
- Automobile
- Top 5 Budget Cars : ఈ దసరాకి కొత్తకారు ప్లాన్ చేస్తున్నారా? రూ.10 లక్షల్లోపు బడ్జెట్లో టాప్-5 కార్లు ఇవే
Top 5 Budget Cars : ఈ దసరాకి కొత్తకారు ప్లాన్ చేస్తున్నారా? రూ.10 లక్షల్లోపు బడ్జెట్లో టాప్-5 కార్లు ఇవే
మీరు రూ.10 లక్షల బడ్జెట్‌లో మంచి కారు కొనాలనుకుంటున్నారా? అయితే తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్, బెస్ట్ సేఫ్టీ, లేటెస్ట్ ఫీచర్లు ఉన్న టాప్ 5 కార్ల లిస్ట్ మీకోసమే ఇక్కడ అందిస్తున్నాం.

రూ.10 లక్షల్లోపు దొరికే టాప్ 5 కార్లు
సొంత కారు అనేేది మిడిల్ క్లాస్ ప్రజల కల. ఆ కలను నిజం చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు బడ్జెట్ ధరల్లో అదిరిపోయే కార్లను అందిస్తున్నాయి. ఇలా కేవలం రూ.10 లక్షల లోపు ధరలో ఇండియన్ మార్కెట్ లో పలు కార్లు ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్, లేటెస్ట్ టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న టాప్ 5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)
ఇండియాలో ఎప్పటికీ క్రేజ్ తగ్గని హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి సుజుకి స్విఫ్ట్. కొత్త జనరేషన్ ఇంజిన్, స్పోర్టీ లుక్‌తో ఈ కారు మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఇందులోని అప్‌గ్రేడెడ్ Z-సిరీస్ ఇంజిన్ సూపర్ మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.6.49 లక్షలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది బెస్ట్ ఆప్షన్.
2. టాటా పంచ్ (Tata Punch)
ఇండియాలో అత్యంత సురక్షితమైన మైక్రో ఎస్‌యూవీల్లో టాటా పంచ్ ఒకటి. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇది 5-స్టార్ రేటింగ్ సాధించింది. మన దేశంలోని గుంతల రోడ్లకు తగ్గట్టుగా, రఫ్ అండ్ టఫ్ లుక్‌తో దీన్ని డిజైన్ చేశారు. దీని ప్రారంభ ధర రూ.6.13 లక్షలు. ఫ్యామిలీ సేఫ్టీ కోరుకునే వాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
3. హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
టాటా పంచ్‌కు గట్టి పోటీ ఇస్తూ మార్కెట్లోకి వచ్చిన కారు హ్యుందాయ్ ఎక్స్‌టర్. ప్రీమియం క్యాబిన్, మోడ్రన్ ఫీచర్లతో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది. వాయిస్ కంట్రోల్ సన్‌రూఫ్, డాష్ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్ ఇందులో స్టాండర్డ్‌గా వస్తాయి. దీని ధర రూ.6.13 లక్షల నుంచి మొదలవుతుంది.
4. మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza)
రూ.10 లక్షల బడ్జెట్‌లో మంచి కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనాలంటే బ్రెజ్జా సరైన ఆప్షన్. పవర్‌ఫుల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, విశాలమైన సీట్లు, సన్‌రూఫ్ ఫీచర్లు లాంగ్ డ్రైవ్‌ను చాలా కంఫర్ట్‌గా మారుస్తాయి. దీని ప్రారంభ ధర రూ.8.34 లక్షలు.
5. రెనాల్ట్ కైగర్ (Renault Kiger)
బడ్జెట్ ధరలో టర్బో ఇంజిన్, స్పోర్టీ లుక్ కోరుకునే యూత్‌ను కైగర్ బాగా అట్రాక్ట్ చేస్తోంది. పెద్ద బూట్ స్పేస్, ప్రీమియం డాష్‌బోర్డ్ దీనికి ప్లస్ పాయింట్స్. దీని ధర రూ.6 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.
తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ సేఫ్టీ, లేటెస్ట్ ఫీచర్లు ఆశించే కస్టమర్లకు ఈ 5 కార్లు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని కచ్చితంగా చెప్పొచ్చు.
