MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Automobile
  • Driving Rules : ఇండియాలో ఎడమవైపు, ఇతర దేశాల్లో కుడివైపు డ్రైవింగ్ ఎందుకు? ఇంట్రెస్టింగ్ స్టోరీ

Driving Rules : ఇండియాలో ఎడమవైపు, ఇతర దేశాల్లో కుడివైపు డ్రైవింగ్ ఎందుకు? ఇంట్రెస్టింగ్ స్టోరీ

ఇండియాలో రోడ్డుకు ఎడమవైపు వాహనాలు నడుపుతారు. అదే అమెరికా, యూరప్ కంట్రీస్ లో కుడివైపు వెళ్తారు. కార్లు ఆధునిక ఆవిష్కరణే అయినా ప్రపంచమంతా ఒకే రకమైన ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించడం లేదు..? కారణమేంటి..?

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 12 2026, 07:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అసలు ట్రాఫిక్ రూల్స్ ఎలా వచ్చాయి..?
Image Credit : Gemini AI

అసలు ట్రాఫిక్ రూల్స్ ఎలా వచ్చాయి..?

ఇండియాలో ఎడమవైపు, అమెరికా వంటి దేశాల్లో కుడివైపు డ్రైవింగ్ గురించి తెలుసుకోవాలంటే కార్ల ఆవిష్కరణకు ముందు కాలానికి వెళ్లాలి.  ఇప్పటి మాదిరిగానే మధ్యయుగంలో కూడా కుడిచేతి వాటంవారే ఎక్కువగా ఉండేవారు. ఈ సమయంలో రాజులు, సైనికులు గుర్రంపై వెళ్తున్నప్పుడు ఎదురుగా ఎవరైనా వస్తే.. తన కుడిచేత్తో కత్తి దూయడానికి లేదా స్నేహపూర్వకంగా కరచాలనం చేయడానికి వీలుగా ఉండేలా రోడ్డుకు ఎడమవైపు నుంచే వెళ్లేవారు. చెప్పాలంటే ప్రపంచంలో మొదటి ట్రాఫిక్ రూల్ వచ్చింది రవాణా కోసం కాదు రక్షణ కోసం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్రిటన్ పాలన ఎఫెక్ట్..
Image Credit : Getty

బ్రిటన్ పాలన ఎఫెక్ట్..

యుద్దాల సమయంలో పాటించిన ట్రాఫిక్ రూల్స్ నే బ్రిటన్ చట్టబద్దం చేసింది… తాము పాలించే దేశాల్లోనూ ఇలాంటి నిబంధనలే తీసుకువచ్చింది. ఇలా తమ ఆధీనంలో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఎడమవైపు ప్రయాణాన్నే చట్టబద్దం చేసింది. స్వాతంత్య్రం తర్వాత ఇండియా కొత్తగా ట్రాఫిక్ రూల్స్ మార్చలేదు… అందుకే మనం ఇప్పటికీ రోడ్డుకు ఎడమవైపే డ్రైవ్ చేస్తాం.

Related Articles

Related image1
Budget Car: దేశంలో అత్యంత చ‌వ‌కైన 7 సీట‌ర్ కారు ఇదే.. ఫీచ‌ర్లు కూడా సూప‌ర్
Related image2
Auto Expo: సిటీలో ఎక్కడికైనా నిమిషాల్లో వెళ్లవచ్చు.. త్వరలోనే ఫ్లయింగ్ టాక్సీ
35
కుడివైపు ప్రయాణానికి కారణం..?
Image Credit : Chatgpt

కుడివైపు ప్రయాణానికి కారణం..?

మరోవైపు ఐరోపా దేశాల్లో కుడివైపు ప్రయాణాన్ని ప్రోత్సహించడంలో నెపోలియన్ కీలక పాత్ర పోషించాడు. ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలు ఈ పద్ధతిని అనుసరించాయి. ఫలితంగా ఐరోపా, బ్రిటన్ కాలనీల మధ్య పెద్ద భౌగోళిక రవాణా వ్యత్యాసం ఏర్పడింది.

45
 అమెరికా ట్రాఫిక్ రూల్స్ సంగతేంటి..?
Image Credit : Getty

అమెరికా ట్రాఫిక్ రూల్స్ సంగతేంటి..?

అమెరికా చరిత్ర కాస్త భిన్నం. 18వ శతాబ్దంలో వాడిన పెద్ద సరుకు బండ్లకు డ్రైవర్‌కు ప్రత్యేక సీటు ఉండేది కాదు. వాళ్లు ఎడమవైపు గుర్రంపై కూర్చొని, కుడిచేత్తో బండిని నడిపేవారు. ఇలాంటప్పుడు రోడ్డుకు కుడివైపు వెళ్తేనే ఎదురుగా వచ్చే వాహనాలను గమనించడం సులభంగా ఉండేది. అమెరికాలో కుడివైపు అలవాటు రావడానికి ఇదే కారణమైంది.

ఆ తర్వాత 1908లో హెన్రీ ఫోర్డ్ ప్రవేశపెట్టిన 'మోడల్ టి' (Ford Model T) కారులో స్టీరింగ్ ఎడమవైపు ఉండేది. ఇది కుడివైపు డ్రైవింగ్‌కు సరిగ్గా సరిపోవడంతో కాలక్రమేణా అమెరికా పూర్తిగా ఆ పద్ధతికి మారింది.

55
ఇప్పుడు మార్చడం ఎందుకు కష్టం?
Image Credit : Gemini Ai

ఇప్పుడు మార్చడం ఎందుకు కష్టం?

ఇప్పుడు ఈ పద్ధతిని మార్చడం చాలా ఖర్చుతో కూడుకున్న, కష్టమైన పని. రోడ్డు గుర్తులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, బస్టాప్‌లు, వాహనాల నిర్మాణం వరకు అన్నీ మార్చాలంటే మిలియన్ల డాలర్లు అవసరమవుతాయి. స్వీడన్ 1967లో 'డేగన్ హెచ్' (Dagen H) పేరుతో ఎడమవైపు నుంచి కుడివైపు డ్రైవింగ్‌కు మారింది. ఇదే అతిపెద్ద మార్పుగా చెబుతారు.

చరిత్రలోని ఆసక్తి!

నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75% దేశాలు కుడివైపే వాహనాలు నడుపుతున్నాయి. కానీ మనం ఇప్పటికీ ఎడమవైపు నడపడానికి కారణం మధ్యయుగ యోధుల రక్షణ వ్యూహమేనంటే నమ్మగలరా? నెక్స్ట్ టైమ్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, చరిత్రలోని ఓ ఆసక్తికరమైన భాగాన్ని మీరు నడుపుతున్నారని గుర్తుంచుకోండి!

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
TVS: 145 కిలోమీట‌ర్ల మైలేజ్‌, టైప్‌సీ ఛార్జ‌ర్‌.. టీవీఎస్ నుంచి అదిరిపోయే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్
Recommended image2
Bajaj Pulsar: కొత్త లుక్.. క్రేజీ ఫీచర్లు.. మార్కెట్లోకి సరికొత్త బజాజ్ పల్సర్ 150, 125 గ్రాండ్ ఎంట్రీ
Recommended image3
Ola Scooter Offers : కేవలం రూ.59,999 కే ఓలా స్కూటర్, నెలనెలా అతి తక్కువ EMI.. ఈ ఆఫర్ మిస్ అవ్వొద్దు
Related Stories
Recommended image1
Budget Car: దేశంలో అత్యంత చ‌వ‌కైన 7 సీట‌ర్ కారు ఇదే.. ఫీచ‌ర్లు కూడా సూప‌ర్
Recommended image2
Auto Expo: సిటీలో ఎక్కడికైనా నిమిషాల్లో వెళ్లవచ్చు.. త్వరలోనే ఫ్లయింగ్ టాక్సీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved