MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Automobile
  • Budget EV Cars : కేవలం రూ.8 లక్షల్లోనే ఎలక్ట్రిక్ కార్లు.. తక్కువ బడ్జెట్లో బెస్ట్ EV లు ఇవే..!

Budget EV Cars : కేవలం రూ.8 లక్షల్లోనే ఎలక్ట్రిక్ కార్లు.. తక్కువ బడ్జెట్లో బెస్ట్ EV లు ఇవే..!

పెట్రోల్, డీజిల్ ధరలు మెళ్లిగా పెరుగుతుండటంతో జనాలు ఎలక్ట్రిక్ కార్ల వైపు చూస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా బడ్జెట్ లో వస్తే EV కి షిప్ట్ అయ్యేందుకు సిద్దమవుతున్నారు.ఈ క్రమంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ఈవి కార్ల గురించి తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 20 2026, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బడ్జెట్ ఈవీలకు పెరిగిన డిమాండ్
Image Credit : TATA MOTORS

బడ్జెట్ ఈవీలకు పెరిగిన డిమాండ్

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం ఎఫెక్ట్ యావత్ ప్రపంచంపై పడింది. అమెరికా ఆంక్షలు, రూపాయి క్షీణత వంటి పరిణామాలు ఇండియాలో పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పలేదు... దీంతో సామాన్య ప్రజల నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు అయ్యింది. ముఖ్యంగా నగరాల్లో రోజూ 40 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించే వారికి ఇంధన ఖర్చులు భారంగా మారాయి. అందుకే ఖర్చు తగ్గించుకునేందుకు చాలామంది ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లుతున్నారు... ఆటోమెటిగ్గా వాటికి డిమాండ్ పెరుగుతోంది.

అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల మాదిరిగానే ఎలక్ట్రిక్ కార్లు కూడా బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. రూ.10 లక్షల లోపు ధరలో కూడా లభిస్తున్నాయి. టాటా పంచ్, టియాగో, ఎంజీ కామెట్ వంటి కార్లు ఈ బడ్జెట్ లో లభిస్తాయి. మరికొంత బడ్జెట్ పెంచితే అంటే రూ.15 లక్షల్లోపు ఎంజీ విండ్సర్, టాటా నెక్సాన్ వంటి కాస్త లగ్జరీ ఈవి కార్లు వస్తాయి. ఇలా పెట్రోల్, డీజిల్ కార్ల ధరల్లో వచ్చే ఈవిలు ఇంధనం ఖర్చులను తగ్గిస్తాయి, డబ్బులు ఆదా చేస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టాటా పంచ్ ఈవీ (TATA Punch EV)
Image Credit : Tata Motors website

టాటా పంచ్ ఈవీ (TATA Punch EV)

టాటా పంచ్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.9.69 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది ఇండియాలో ప్రస్తుతం బాగా పాపులర్ మోడల్... పలు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని టాప్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుంది. ఎస్‌యూవీ లాంటి హై గ్రౌండ్ క్లియరెన్స్, సౌకర్యవంతమైన సీటింగ్ దీని ప్రత్యేకత.

Related Articles

Related image1
TATA Cars Offer : టాటా నెక్సాన్, పంచ్, కర్వ్ EV లపై బంపరాఫర్ .. డిస్కౌంట్ డబ్బులతో మరో కారే కొనొచ్చు..!
Related image2
Best EV in India : తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. టాప్ 5 బెస్ట్ ఈవీ కార్లు ఇవే
36
టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)
Image Credit : TATA MOTORS

టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)

టాటా టియాగో ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్లలో ఇది ఒకటి. బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ఈ కారు 315 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది.

46
ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV)
Image Credit : Gemini

ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV)

ఎంజీ కామెట్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.63 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని ప్రత్యేకంగా నగర ప్రయాణాల కోసం డిజైన్ చేశారు. ఇది 230 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని ఎంజీ చెబుతోంది. దీని కాంపాక్ట్ డిజైన్ రద్దీగా ఉండే నగరాల్లో చాలా ఉపయోగపడుతుంది.

56
టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)
Image Credit : tata motors

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)

టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.12.49 లక్షల నుంచి మొదలవుతుంది. హైవే ప్రయాణాలు, రోజువారీ ప్రయాణాలకు అనువుగా దీన్ని రూపొందించింది. దీని టాప్-స్పెక్ వేరియంట్ 450 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

66
ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV)
Image Credit : MG Website

ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV)

ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.14.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్పోర్టీ స్టైలింగ్‌తో పాటు విశాలమైన క్యాబిన్ స్పేస్, సౌకర్యవంతమైన ఫ్యామిలీ ప్రయాణానికి ఈ కారు ప్రాధాన్యం ఇస్తుంది. వేరియంట్‌ను బట్టి ఇది 300 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని ఎంజీ చెబుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kia Car Offers : కియా కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల భారీ డిస్కౌంట్
Recommended image2
Maruti Baleno : మీదగ్గర కేవలం రూ.11,000 ఉంటే చాలు.. సరికొత్త మారుతి బాలెనో కారు సొంతం చేసుకొండి
Recommended image3
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Related Stories
Recommended image1
TATA Cars Offer : టాటా నెక్సాన్, పంచ్, కర్వ్ EV లపై బంపరాఫర్ .. డిస్కౌంట్ డబ్బులతో మరో కారే కొనొచ్చు..!
Recommended image2
Best EV in India : తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. టాప్ 5 బెస్ట్ ఈవీ కార్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved