MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Car Maintenance : కార్ సర్వీసింగ్ కు ఇచ్చినప్పుడు మోసపోవద్దు.. ఏ పార్ట్స్ ఎప్పుడు మార్చాలో తెలుసుకొండి

Car Maintenance : కార్ సర్వీసింగ్ కు ఇచ్చినప్పుడు మోసపోవద్దు.. ఏ పార్ట్స్ ఎప్పుడు మార్చాలో తెలుసుకొండి

కార్ సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు ఏ పార్ట్ ఎప్పుడు మార్చాలో మీకు తెలిస్తే.. వేలకు వేలు ఆదా చేసుకోవచ్చు. ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ ప్యాడ్ లాంటి ముఖ్యమైన భాగాల లైఫ్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 08 2026, 09:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కార్ సర్వీస్ ఖర్చు తగ్గించే మార్గాలు
Image Credit : AI

కార్ సర్వీస్ ఖర్చు తగ్గించే మార్గాలు

చాలామంది కార్ ఓనర్లు సర్వీస్ సెంటర్‌కు వెళ్లినప్పుడు, అక్కడి టెక్నీషియన్లు చెప్పిందంతా గుడ్డిగా నమ్మేసి చాలా పార్ట్స్‌ను మార్పించేస్తుంటారు. కానీ ప్రతి స్పేర్ పార్ట్‌కు ఓ లైఫ్ టైమ్ ఉంటుంది. అది తెలుసుకుంటే అనవసర ఖర్చులు తగ్గడమే కాదు, మీ కారు కూడా సేఫ్‌గా ఉంటుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్
Image Credit : Gemini

ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్

కారు మంచి కండీషన్ లో ఉండాలంటే ఇంజిన్ ఆయిలే కీలకం. ఇది ఇంజిన్‌ను చల్లగా, స్మూత్‌గా నడిపిస్తుంది. సాధారణంగా మినరల్ ఆయిల్‌ను ప్రతి 8,000 - 10,000 కిలోమీటర్లకు, సింథటిక్ ఆయిల్‌ను 10,000 - 12,000 కిలోమీటర్లకు ఒకసారి మార్చాలి. ఇక ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్‌కు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. దుమ్ము ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరిగే కార్లలో దీన్ని తరచుగా చెక్ చేయాలి.

35
టైర్లు, బ్రేకులు చెక్ చేసుకొండి
Image Credit : FREEPIK

టైర్లు, బ్రేకులు చెక్ చేసుకొండి

కారు సేఫ్టీ, స్మూత్ రైడింగ్‌లో టైర్లది కీలక పాత్ర. అందుకే ప్రతి 8,000 నుంచి 10,000 కిలోమీటర్లకు ఒకసారి టైర్ రొటేషన్ చేయించాలి. దీనివల్ల టైర్లు సమానంగా అరిగి ఎక్కువ కాలం మన్నుతాయి. బ్రేక్ ప్యాడ్‌లను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో ఎక్కువగా తిరిగే కార్లలో ఇవి త్వరగా అరిగిపోతాయి.
45
ఎక్కువ కాలం పనిచేసే భాగాలు
Image Credit : freepik

ఎక్కువ కాలం పనిచేసే భాగాలు

కూలెంట్, స్పార్క్ ప్లగ్స్ వంటి భాగాలను వెంటనే మార్చాల్సిన అవసరం లేదు. ఇవి సాధారణంగా 30,000 నుంచి 40,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి. కాబట్టి వీటిని అనవసరంగా మార్పించి డబ్బులు వృధా చేసుకోవద్దు.

55
గేర్ ఆయిల్ మర్చిపోవద్దు
Image Credit : Gemini

గేర్ ఆయిల్ మర్చిపోవద్దు

గేర్ ఆయిల్‌ను తరచుగా మార్చాల్సిన పనిలేదు. చాలా కార్లలో ఇది 50,000 నుంచి 60,000 కిలోమీటర్ల వరకు బాగానే పనిచేస్తుంది. సరైన టైమ్‌కు కారుకు మెయింటెనెన్స్ చేయిస్తే అది ఎక్కువ కాలం స్మూత్‌గా నడుస్తుంది, మీ డబ్బు కూడా ఆదా అవుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Budget Cars: పండగ సేల్... చాలా తక్కువ ధరకే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్న టాప్ 5 కార్లు
Recommended image2
Car Offers : అక్టోబర్ లో ఈ కారు కొంటే.. ఏకంగా రూ.2.34 లక్షలు సేవ్
Recommended image3
Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు
Related Stories
Recommended image1
Car Accessories : కేవలం రూ.300 లోపే.. ఈ కార్ యాక్సెసరీలు మీ సొంతం!
Recommended image2
automobile sales:ఫిబ్రవరిలో ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతి విభాగంలో నష్టం, హోల్‌సేల్ విక్రయాల్లో భారీ క్షీణత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved