- Home
- Automobile
- Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు
Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు
Best Mileage Cars in India : కుటుంబాన్ని కారులో తిప్పాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ శాలరీ లేదా ఆదాయం తక్కువగా ఉండటంవల్ల మెయింటెనెన్స్ భారం అని ఆగిపోతుంటారు. బైక్ స్ధాయి మెయింటెనెన్స్ కలిగిన కార్లు ఉన్నాయి.. వాటిగురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఇండియాలో బెస్ట్ మైలేజ్ కార్లు...
Best Cars in India : మధ్య తరగతి ప్రజలు లగ్జరీ కంటే సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తారు. అంటే తక్కువ ఖర్చులోని మంచి సౌకర్యాలు కోరుకుంటారు. ఇలాంటివారు సాధారణంగా బైక్ వాడేందుకే ప్రాధాన్యం ఇస్తారు... కానీ ఫ్యామిలీ పెరిగాక వారికోసమైనా బడ్జెట్ ప్రెండ్లీ కారును కావాలనుకుంటారు. ఇలాంటి సామాన్య వేతనజీవులు, మధ్యస్థ స్థాయి ఆదాయం కలిగినవారికోసం మారుతి సుజుకి కొన్ని కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఆల్టో 800 (Maruti Suzuki Alto 800)
రాయల్ ఎన్ ఫీల్డ్, కేటిఎం వంటి కొన్ని బైక్స్ కేవలం 30 నుండి 40 కిలోమీటర్/లీటర్ మైలేజ్ ఇస్తుంటాయి. ఇలాంటి లగ్జరీ బైక్స్ ధర కూడా లక్షల్లో ఉంటుంది. సేమ్ ఇదే మైలేజ్ తో, ఇదే ధరతో కారు వస్తుంది... అదే మారుతి సుజుకి ఆల్టో 800. ఇది బేసిక్ మోడల్ అయినప్పటికీ బడ్జెట్ ప్రెండ్లీ... బైక్ మెయింటెనెన్స్ లో కారు కావాలనుకునేవారికి ఇది పర్పెక్ట్ ఛాయిస్.
ఆల్టో 800 కారు 25 Kmpl మైలేజ్ ఇస్తుంది... ఇదే CNG వేరియంట్ అయితే 34 km/Kg మైలేజ్ ఇస్తుంది. సిఎన్జి ధరకూడా పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ మారుతి ఆల్టో 800 కారు ధర కూడా చాలా తక్కువే... రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు లభించేది. అయితే ఈ మోడల్ ను మారుతి సుజుకి నిలిపివేసింది.. కాబట్టి సెకండ్ హ్యాండ్ లో మాత్రమే లభిస్తాయి. అంటే అతి తక్కువ ధరకు లభించే బెస్ట్ మైలేజ్ కారు మారుతి ఆల్టో 800.
మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10)
బడ్జెట్ ప్రెండ్లీ ఆల్టో 800 ను రీప్లేస్ చేసేందుకు మారుతి సుజుకి తీసుకువచ్చిన మోడల్ ఆల్టో K10. ఇది ప్రస్తుతం భారతదేశంలో సామాన్య ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్న మోడల్. ఈ ఆల్టో K10 మైలేజ్ కూడా పెట్రోల్ అయితే 24-25 Kmpl, సిఎన్జి (CNG) అయితే 34-35 Km/Kg మైలేజ్ ఇస్తుంది. దీని ధర కూడా కేవలం రూ.3.70 లక్షల నుండి రూ.5.45 లక్షల వరకు ఉంటుంది.
మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)
మారుతి సుజుకి చెందిన మరో బడ్జెట్ ప్రెండ్లీ కారు సెలెరియో. ఇది ఆల్టో మోడల్ కంటే కాస్త మెరుగైన ఫీచర్లు, రిచ్ లుక్ కలిగి ఉంటుంది. కానీ మైలేజ్ విషయంలో ఆల్టో తో పోటీ పడుతుంది... పెట్రోల్ అయితే 24-25 Kmpl, సిఎన్జి అయితే 34-35 Km/Kg మైలేజ్ ఇస్తుంది. సెలెరియో ధర రూ.4.70 లక్షల నుండి రూ.6.73 లక్షల వరకు ఉంటుంది.
మారుతి సుజుకి స్విప్ట్ (Maruti Suzuki Swift)
మంచి మైలేజ్ తో పాటు కాస్త పెద్దకారు కావాలనుకునేవారికి మారుతి సుజుకి స్విప్ట్ బెస్ట్ ఛాయిస్. ఇది రిచ్ లుక్ కలిగివుండి సూపర్ మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్, సిఎన్జీ వేరియంట్ ను బట్టి 24 నుండి 33 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కానీ ధరే కాస్త ఎక్కువగా ఉంటుంది... రూ.5 లక్షల నుండి రూ.9 లక్షల వరకు లభిస్తుంది.
గమనిక : కారు మైలేజ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో తక్కువగా ఉంటుంది... అదే హైవేలపై అయితే ఎక్కువగా వస్తుంది. అలాగే ధరలు కూడా నగరం, షోరూంని బట్టి మారుతుంటాయి.

