MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • EV Bikes : 2 గంటల్లో 80% ఛార్జింగ్, 260 కిమీ రేంజ్, 5 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. కేవలం రూ.799 తో ఈ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేసుకొండి

EV Bikes : 2 గంటల్లో 80% ఛార్జింగ్, 260 కిమీ రేంజ్, 5 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. కేవలం రూ.799 తో ఈ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేసుకొండి

ఇండియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ స్టార్టప్ సంస్థ అవోర్ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ 'అవోర్ ఈఎక్స్' మోడల్స్ ను లాంచ్ చేసింది.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 29 2026, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మార్కెట్లోకి అవోర్ ఎలక్ట్రిక్ బైక్స్
Image Credit : Avore Electric Bike

మార్కెట్లోకి అవోర్ ఎలక్ట్రిక్ బైక్స్

Avore EV Bikes : భారత ఆటోమొబైల్ సంస్థ అవోర్ ఎలక్ట్రిక్స్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్స్ 'అవోర్ ఈఎక్స్'ను పరిచయం చేసింది. సేమ్ లుక్ తో మూడు మోడల్స్ ని లాంచ్ చేసింది... EX1, EX2, EX2S పేర్లతో వీటిని అందుబాటులోకి తెస్తోంది. కేవలం రూ.799 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి స్పోర్ట్స్ లుక్ లో అదిరిపోయే ఈ EV బైక్ ను ప్రీబుక్ చేసుకోవచ్చు.

ఈ అవోర్ EX1, EX2, EX2S మోడల్స్ లుక్ పరంగా ఒకేలా ఉన్నప్పటికీ బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఇతర ఫీచర్లు వేరువేరుగా ఉంటాయి. అవోర్ EX1 అనేది ఎంట్రీ లెవెల్ మోడల్... దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.23 లక్షలుగా నిర్ణయించారు. కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఈ మోడల్స్ ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అవోర్ ఈఎక్స్ వేరియంట్స్ ధరలు..
Image Credit : Avore

అవోర్ ఈఎక్స్ వేరియంట్స్ ధరలు..

అవోర్ ఎంట్రీ లెవెల్ బైక్ EX1 కంటే EX2, EX2S ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఈఎక్స్2 అనేది మిడ్ లెవెల్ బైక్.. దీని ధర రూ.1.46 లక్షలుగా ఉంది. అదే టాప్ వేరియంట్ ఈఎక్స్2ఎస్ ధర రూ.1.70 లక్షలు. (ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు... నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పు ఉంటుంది.)

అవోర్ ఈఎక్స్ మూడు వేరియంట్స్ ను కూడా రూ.799 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్నాక సుమారు రెండు నెలల్లోపు కస్టమర్లకు డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ చెబుతోంది.

Related Articles

Related image1
EV Bike Subsidy : ఈ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఇ-బైక్ పై ఏకంగా లక్ష రూపాయల సబ్సిడీ
Related image2
Long Drive EV Bike: ఈ బైక్‌ను 20 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 600 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోవచ్చు
34
అవోర్ EX EV బైక్స్ రేంజ్ ఎంత?
Image Credit : Avore

అవోర్ EX EV బైక్స్ రేంజ్ ఎంత?

ఈ అవోర్ EX మోడల్స్ రేంజ్ విషయానికొస్తే... టాప్ వేరియంట్ ఈఎక్స్2ఎస్ ను ఫుల్ ఛార్జ్‌ చేస్తే 260 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ఠ వేగం గంటకు 114 కిలోమీటర్లు.

ఇక మిడ్ వేరియంట్ ఈఎక్స్2 మోడల్ 255 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందట. దీని గరిష్ఠ వేగం గంటకు 100 కి.మీ. బేస్ వేరియంట్ అయిన ఈఎక్స్1 అయితే 160 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ఠ వేగం కూడా గంటకు 100 కి.మీ.

గత మూడేళ్లుగా ఈ బైక్స్ ను అభివృద్ధి చేస్తున్నామని... బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, మోటార్, మోటార్ కంట్రోలర్, ఆన్‌బోర్డ్ ఛార్జర్, ఆపరేటింగ్ సిస్టమ్‌తో సహా 120కి పైగా పేటెంట్ల కోసం దరఖాస్తు చేసినట్లు అవోర్ కంపెనీ తెలిపింది.

44
అవోర్ EX EV బైక్స్ ఫీచర్లు..
Image Credit : Avore

అవోర్ EX EV బైక్స్ ఫీచర్లు..

ఈ అవోర్ బైక్స్ వేరియంట్‌ను బట్టి 7.5 kW నుంచి 10.5 kW వరకు శక్తిని అందిస్తుంది. అన్ని వేరియంట్లలో 250 Nm పీక్ వీల్ టార్క్ ఉండటంతో వేగవంతమైన యాక్సిలరేషన్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా మ్యాన్యువల్, ఆటోమేటిక్ మోడ్స్, AI ఆధారిత రైడర్ అసిస్టెంట్, కనెక్టెడ్ టెక్నాలజీ, కంపెనీ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఈ అవోర్ ఈఎక్స్ మోడల్స్ లో ఉన్నాయని వెల్లడించింది.

సాధారణ హోమ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్‌తోనే ఈ బైక్‌ను ఛార్జ్ చేయవచ్చు. 20% నుంచి 80% వరకు 2 గంటల్లో, 100% ఫుల్ ఛార్జ్ సుమారు 4 గంటల్లో పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. భద్రత కోసం AIS 156, AIS 038 ప్రమాణాలకు అనుగుణంగా ఈ బైక్‌ను తయారు చేశారట. అవోర్ ఈఎక్స్ బైక్స్ బ్యాటరీపై 5 సంవత్సరాలు లేదా 60,000 కి.మీ వారంటీ కూడా ఇస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest Bike in India : కేవలం రూ.59999కే కొత్త బైక్.. మైలేజ్ ఎంతిస్తుందో తెలిస్తే షాకే..!
Recommended image2
Bikes : 350cc రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ రూ.1.38 లక్షలే.. రూ.2 లక్షల్లో వచ్చే టాప్ 5 బైక్స్ ఇవే
Recommended image3
Tata Car Offers : టాటా కారు కొనాలంటే ఇదే పర్ఫెక్ట్ టైమ్.. డిస్కౌంటే రూ.2.25 లక్షలా..!
Related Stories
Recommended image1
EV Bike Subsidy : ఈ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఇ-బైక్ పై ఏకంగా లక్ష రూపాయల సబ్సిడీ
Recommended image2
Long Drive EV Bike: ఈ బైక్‌ను 20 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 600 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved