MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Automobile
  • Family Scooter: బడ్జెట్ లో ఫ్యామిలీ మొత్తానికి సరిపోయే స్కూటర్..త్వరలో మార్కెట్లోకి, సింపుల్ ఎనర్జీ సర్ ప్రైజ్

Family Scooter: బడ్జెట్ లో ఫ్యామిలీ మొత్తానికి సరిపోయే స్కూటర్..త్వరలో మార్కెట్లోకి, సింపుల్ ఎనర్జీ సర్ ప్రైజ్

Family Scooter: ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో మరో ట్రెండ్ రాబోతుంది. రోజువారీ ప్రయాణాలు, ఫ్యామిలీ అవసరాల దృష్టిలో పెట్టుకుని కొత్త ఫ్యామిలీ స్కూటర్‍ను త్వరలో పరిచయం చేయనుంది.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 24 2026, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఫ్యామిలీ మొత్తానికి సరిపోయే స్కూటర్
Image Credit : our own

ఫ్యామిలీ మొత్తానికి సరిపోయే స్కూటర్

ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో మరో ట్రెండ్ రాబోతుంది. రోజువారీ ప్రయాణాలు, ఫ్యామిలీ అవసరాల దృష్టిలో పెట్టుకుని కొత్త ఫ్యామిలీ స్కూటర్‍ను త్వరలో పరిచయం చేయనుంది. హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ టూ-వీలర్లను తయారు చేసే సింపుల్ ఎనర్జీ, ఇప్పుడు ఫ్యామిలీల కోసం ప్రత్యేకంగా ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రకటించింది. కంపెనీ ప్రకటన ప్రకారం, ఈ కొత్త మోడల్ 2026 సెప్టెంబర్ 2న అధికారికంగా లాంచ్ కానుంది.

ఇప్పటివరకు వేగం, ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలపై దృష్టి పెట్టిన సింపుల్ ఎనర్జీ, ఈసారి కుటుంబాల రోజువారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త దారిలో వెళ్తోంది. సింపుల్ వన్, సింపుల్ ఆల్ట్రా వంటి మోడళ్లు వాటి వేగానికి, లాంగ్ రేంజ్‌కు పేరుగాంచినా, ఈ కొత్త ఫ్యామిలీ స్కూటర్ మాత్రం పట్టణాల్లో రోజువారీ ప్రయాణాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కొత్త స్కూటర్
Image Credit : Simple Energy

కొత్త స్కూటర్

ఆఫీస్, స్కూల్, కాలేజ్, మార్కెట్ వంటి రోజువారీ ప్రయాణాలను సులభంగా చేసేందుకు ఈ స్కూటర్‌లో సౌకర్యవంతమైన సీటింగ్, సులభంగా ఆపరేట్ చేసే సిస్టమ్, అందరికీ ఉపయోగపడే ప్రాక్టికల్ ఫీచర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది.

ఈ కొత్త మోడల్ పేరు, బ్యాటరీ కెపాసిటీ, ఒక్కసారి చార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది, ధర, ఇతర టెక్నికల్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే, ఏళ్ల తరబడి చేసిన రీసెర్చ్, టెస్టింగ్, ఇంజనీరింగ్ ఆధారంగా ఈ స్కూటర్‌ను డెవలప్ చేసినట్లు సింపుల్ ఎనర్జీ చెప్పింది. లాంచింగ్ ఈవెంట్‍లో వివరాలు వెల్లడించనున్నారు.

33
ఫ్యామిలీల కోసం స్కూటర్
Image Credit : X

ఫ్యామిలీల కోసం స్కూటర్

ఇండియన్ ఫ్యామిలీ కుటుంబ అవసరాలను దృష్ట్యా కొత్త డిజైన్, అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, కంపెనీ సొంత టెక్నాలజీలతో ఈ మోడల్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రేర్-ఎర్త్ మినరల్స్ లేకుండా ఎలక్ట్రిక్ మోటార్‌ను వాణిజ్యపరంగా తయారు చేసిన మొదటి ఇండియన్ కంపెనీలలో తమది ఒకటని సింపుల్ ఎనర్జీ చెబుతోంది. దీని ద్వారా దేశీయ టెక్నాలజీ అభివృద్ధిపై కంపెనీ ఎంత దృష్టి పెడుతుందో అర్థమవుతోంది.

ప్రస్తుతం కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన సింపుల్ ఆల్ట్రా.. ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ, లాంగ్ రేంజ్, గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగం, ఫాస్ట్ యాక్సిలరేషన్, పెద్ద ఇన్ఫర్మేషన్ స్క్రీన్, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో వస్తుంది. కానీ ఈ కొత్త ఫ్యామిలీ స్కూటర్ వేగం కంటే మన్నిక, సౌకర్యం, రోజువారీ వినియోగానికి బాగుంటుంది. కుటుంబాలు, విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు, పట్టణవాసుల అవసరాలను తీర్చే కొత్త ఆప్షన్‌గా ఈ మోడల్ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆటోమొబైల్
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Suzuki : 35 కి.మీ మైలేజ్ తో నయా టాల్ బాయ్ కారు రెడీ.. కేవలం రూ.5 లక్షలకే వస్తుందా..!
Recommended image2
Top 3 Tata Cars : అమ్మకాల్లో అదరగొడుతున్న టాప్ 3 టాటా మోడల్స్ ఇవే
Recommended image3
Top 5 Scooters : ఇండియన్స్ ఎగబడి కొంటున్న టాప్ 5 స్కూటర్లు ఇవే
Related Stories
Recommended image1
Bike Riding Tips: వర్షాకాలంలో బైక్ పై వెళ్లేటప్పుడు ఇవి చెక్ చేస్తున్నారా?
Recommended image2
Car Driver Salary: అమెరికాలో కారు నడిపితే నెలకు ఎంత వస్తుందో తెలుసా? దెబ్బకు లైఫ్ సెటిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved