Maruti Invicto : ఈ కారుపై డిస్కౌంటే రూ.2,15,000 .. అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్
కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే ముందే ఈ ఏడాది మోడల్స్ మొత్తం క్లియర్ చేసేందుకు కార్ల కంపెనీలు సిద్దమయ్యాయి. అందులో భాగంగా భారీగా ఇయర్ ఎండ్ ఆఫర్లు ప్రకటించాయి.

ఈ మోడల్ కార్లపై భారీ ఆఫర్లు
Maruti Invicto : కొత్త కారు కొనాలనుకునేవారికి ఇదే సూపర్ ఛాన్స్. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు భారీగా ఇయర్ ఎండ్ ఆఫర్లు ప్రకటించాయి... కాబట్టి తక్కువధరకే నచ్చిన కారును సొంతం చేసుకోవచ్చు. కొన్నికార్లపై అయితే ఏకంగా లక్షల్లో డిస్కౌంట్ ఇస్తున్నాయి. అలాంటివాటిలో మారుతి సుజకి ఇన్విక్టో (Invicto) ఒకటి.
మారుతి సుజుకి ఇన్విక్టో పై సూపర్ ఆఫర్...
Maruti Invicto ప్రీమియం MPV పై ఇయర్ ఎండ్ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ కారు కొనుగోలుచేసేవారు గరిష్ఠంగా రూ.2.15 లక్షలు ఆదా చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ లక్ష రూపాయలతో పాటు ఎక్చేంజ్/స్రాప్ కింద మరో రూ.1.15 లక్ష బెనిఫిట్స్ పొందవచ్చు. ఇలా మారుతి సుజుకికి చెందిన ఈ ప్రీమియం కారుపై భారీ తగ్గింపు పొందవచ్చు.
మారుతి సియాజ్ (Maruti Ciaz)
మారుతి సుజుకి కంపెనీ ప్రముఖ మోడల సియాజ్ పై కూడా భారీ ఆఫర్ ప్రకటించింది. ఇయర్ ఎండ్ ఆఫర్ కింద రూ.1.30 లక్షల తగ్గింపుకే సియాజ్ ను పొందవచ్చు. దీని ధర రూ.9.9 లక్షల నుండి రూ.11.89 లక్షల వరకు ఉంది.
మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx)
మారుతికి చెందిన సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ SUV ఫ్రాంక్స్ ధరకూడా భారీగా తగ్గింది. ఇప్పటికే అందుబాటు ధరలో ఉన్న ఈ కారు ఇయర్ ఎండ్ ఆఫర్ గా మరో రూ.88.000 వరకు తగ్గుతోంది. ఇది రూ.6.85 లక్షల నుండి రూ.11.98 లక్షల ధరలో లభిస్తుంది.
టాటా కార్లపై భారీ డిస్కౌంట్
కేవలం మారుతి సుజుకి మాత్రమే కాదు టాటాకు చెందిన ప్రముఖ మోడల్స్ పై ఇయర్ ఎండ్ ఆఫర్స్ కొనసాగుతున్నాయి. టాటా హారియర్, సఫారీ వంటి SUV లపై రూ.75 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. క్యాష్ డిస్కౌంట్స్ తో పాటు ఎక్చేంజ్ ఆఫర్లను ప్రకటించాయి కార్ల కంపెనీలు.
గమనిక: పైన చెప్పిన డిస్కౌంట్లు దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలు, నగరాలు, డీలర్‌షిప్‌లు, స్టాక్, రంగు, వేరియంట్‌ను బట్టి మారవచ్చు. అంటే ఈ డిస్కౌంట్ మీ నగరంలో లేదా డీలర్‌షిప్‌లో ఎక్కువ లేదా తక్కువగా ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో కారు కొనే ముందు కచ్చితమైన డిస్కౌంట్ వివరాలు, ఇతర సమాచారం కోసం మీ సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించండి.

