Zodiac sign: 2026లో ఈ 5 రాశుల వారు విదేశాలకు వెళ్లే అవకాశం.. ప్రయత్నిస్తే ఫలితం
Zodiac sign: 2026లో గ్రహాల కదలికలు కొన్ని రాశుల జీవితాల్లో కీలక మలుపులు తీసుకురానున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు, విదేశీ అవకాశాలు, కొత్త జీవితం ప్రారంభించే యోగాలు బలపడతాయి. 2026లో స్వదేశం వదిలి విదేశాల్లో జీవించే అవకాశాలు ఉన్న రాశులు ఇవే.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ప్రయాణం జీవిత లక్ష్యాల్లో భాగమే. 2026 ఈ రాశివారికి చాలా ముఖ్యమైన సంవత్సరం. బృహస్పతి ప్రభావంతో కొత్త అనుభవాలు, దూర ప్రాంతాల ప్రయాణాలు, విదేశీ అవకాశాలు పెరుగుతాయి. ఏప్రిల్ నుంచి మే మధ్య కాలంలో బుధుడు, సూర్యుడు, కుజుడు కలిసి ప్రభావం చూపే సమయంలో ధనుస్సు రాశివారు స్వదేశం వదిలి మరో దేశంలో స్థిరపడాలనే ఆలోచన బలపడే అవకాశం ఉంది. చదువు, ఉద్యోగం, వ్యక్తిగత అభివృద్ధి కోణంలో విదేశీ ప్రయాణం ఉపయోగకరంగా మారుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారు కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాల వైపు ఎప్పుడూ ఆకర్షితులవుతారు. 2026లో ఈ రాశి జీవితంలో వేగం పెరుగుతుంది. ఏప్రిల్ చివర్లో యురేనస్ మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మే చివరి నుంచి జూన్ మధ్య కాలంలో ఉద్యోగం, వ్యాపారం, చదువు కారణంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారు స్వభావం ప్రకారం సరిహద్దులను దాటి ఆలోచిస్తారు. 2026 జూలై నుంచి ఈ రాశివారికి గ్రహాల సపోర్ట్ బలంగాా లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చే కాలం ఇది. విదేశీ ప్రయాణాలు సహజంగా జరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు, అంతర్జాతీయ సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. కొందరికి విదేశాల్లో స్థిరపడే యోగం కూడా కనిపిస్తుంది.
మకర రాశి
మకర రాశి వారు ముందస్తు ప్రణాళిక లేకుండా ఏ పని చేయరు. 2026లో బృహస్పతి కర్కాటక రాశిలో గోచారం చేయడం వల్ల ఈ రాశివారికి దూర ప్రయాణాల అవకాశాలు వస్తాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు కాలం చాలా కీలకం. కెరీర్ మార్పులు, కొత్త బాధ్యతలు, విదేశీ ఉద్యోగాలు ఈ సమయంలో రావచ్చు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎదగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మీన రాశి
మీన రాశి వారు భావోద్వేగంగా లోతుగా ఆలోచించే స్వభావం కలవారు. 2026 ప్రారంభం నుంచే కొత్త పరిచయాలు, నెట్‌వర్కింగ్, బాహ్య అనుభవాలు పెరుగుతాయి. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కాలం, అలాగే సెప్టెంబర్ చివరి దశలో గ్రహాల స్థితి ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో విదేశీ ప్రయాణం మాత్రమే కాదు, అక్కడ స్థిరపడే అవకాశాలు కూడా కనిపిస్తాయి.

