- Home
- Business
- Indian Railway: ఒక్క రైలు చక్రం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
Indian Railway: ఒక్క రైలు చక్రం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
Indian Railway: అతిపెద్ద ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థల్లో ఇండియన్ రైల్వే ఒకటి. ప్రతీరోజూ వేలాది మందిని గమ్య స్థానానికి చేర్చుతోంది. అయితే రైల్వేలో ఎన్ని ఆసక్తికర విషయాలు ఉంటాయి. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రైన్ ప్రయాణం వెనుక భారీ ఖర్చు
రైల్వేను సాధారణంగా తక్కువ ఖర్చుతో ప్రయాణించే మార్గంగా భావిస్తాం. కానీ ఆ చౌక ప్రయాణం వెనుక భారీ పెట్టుబడి ఉంటుంది. ఒక ట్రైన్‌లోని ఒక్కో భాగం లక్షలు ఖర్చుతో తయారవుతుందని చాలామందికి తెలియదు. ముఖ్యంగా ట్రైన్ చక్రం ఖర్చు తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.
సాధారణ ఇనుము కాదు
ట్రైన్ చక్రం కేవలం గుండ్రంగా ఉండే ఇనుప ముక్క కాదు. ఇది ప్రత్యేకమైన స్టీల్ మిశ్రమాలతో తయారవుతుంది. వందల టన్నుల బరువును మోయడం, గంటల తరబడి వేగంగా తిరగడం, పట్టాలపై నిరంతర ఘర్షణను తట్టుకోవడం వంటి బాధ్యతలు ఈ చక్రం మీదే ఉంటాయి. అందుకే దీనిని తయారు చేసే సమయంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు. కఠినమైన నాణ్యత పరీక్షలు పూర్తయిన తర్వాతే వినియోగంలోకి తీసుకుంటారు.
ట్రైన్ చక్రం ధర ఎంతంటే?
రైల్వే గణాంకాల ప్రకారం ట్రైన్ చక్రాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి.
ఇంపోర్టెడ్ చక్రాలు: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఒక్క చక్రం ధర సుమారు రూ. 70,000 వరకు ఉంటుంది.
దేశీయంగా తయారైన చక్రాలు: వీటి ధర కొంచెం తక్కువగా ఉండొచ్చు.
ఈ చక్రాలను కోచ్ ఫ్యాక్టరీలు, లోకోమోటివ్ యూనిట్లలో అసెంబుల్ చేస్తారు.
ఒక్క కోచ్‌కు ఎంత ఖర్చు అవుతుంది?
ఒక సాధారణ ప్యాసింజర్ కోచ్‌లో సాధారణంగా 8 చక్రాలు ఉంటాయి. అంటే… ఒక్క కోచ్ చక్రాల ఖర్చు సుమారు రూ. 5.6 లక్షలు అవుతుంది. ఒక ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో 14 నుంచి 18 కోచ్‌లు ఉంటే, కేవలం చక్రాల ఖర్చే కోట్ల రూపాయలకు చేరుతుంది. ఇది కోచ్ నిర్మాణ ఖర్చులో కీలక భాగంగా మారుతుంది.
ఇండియన్ రైల్వే విశేషాలు
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్ నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశంలో 7,500కి పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రోజుకు 13,000కి పైగా ప్యాసింజర్ ట్రైన్లు బయలుదేరుతాయి. కోట్లాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. ఈ భారీ వ్యవస్థను సురక్షితంగా నడిపేందుకు పట్టాలు, సిగ్నల్ వ్యవస్థలు, కోచ్‌లు, ముఖ్యంగా చక్రాలపై ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

