Zodiac signs: మీ రాశి ప్రకారం ఏ రాశి వారిని పెళ్లి చేసుకోవాలో తెలుసా?
చాలా రకాల అనుకూలతలు ఉన్నప్పటికీ,భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం చాలా సహజం. కానీ, వాటి వల్ల భార్యాభర్తల సంబంధం వదులుకోవడం కరెక్ట్ కాదు.

ఏ రాశి వారికి ఏ రాశి మ్యాచ్ అవుతుంది?
జీవితాంతం కలిసి ఉండాలనే కోరికతోనే ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. కానీ, పెళ్లి చేసుకున్న అందరూ జీవితాంతం కలిసి ఉండరు. కొందరు, విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలా విడిపోవడానికి జాతకం కూడా ఒక కారణం కావచ్చు. జోతిష్యశాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. ఈ గ్రహాల ప్రకారం, ఒక రాశి వారు అదే రాశికి చెందిన వారిని పెళ్లి చేసుకోవడం లేదంటే.. తమకు విరుద్దమైన రాశిని పెళ్లి చేసుకోవడం వల్ల వారి జీవితాలు సవ్యంగా ఉండవు. మరి, ఏ రాశివారు ఎవరిని వివాహం చేసుకుంటే.. వారి జీవితం ఆనందంగా ఉంటుందో తెలుసుకుందామా...
చాలా రకాల అనుకూలతలు ఉన్నప్పటికీ,భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం చాలా సహజం. కానీ, వాటి వల్ల భార్యాభర్తల సంబంధం వదులుకోవడం కరెక్ట్ కాదు. మంచి సంబంధానికి సంకేతం ఏ పరిస్థితిలో అయినా ఒకరినొకరు వదులుకోకుండా జీవించడం. మంచి అవగాహనతో మీకు అనుకూలంగా ఉన్న భాగస్వామిని ఎంచుకోవడం కూడా చాలా అవసరం.
1.మేష రాశి...
మేష రాశి వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలి అంటే.. వీరు కుంభ రాశివారిని వివాహం చేసుకోవాలి. ఈ రెండు రాశులు వైవాహిక జీవితంలోకి అడుగుపెడితే.. వారి జీవితం ఆనందంగా సాగుతుంది. కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఇద్దరూ కలిసి కొత్తవి నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.జీవితం ఆనందంగా సాగుతుంది.
వృషభం - కర్కాటకం
ఈ రెండు రాశులవారు ఒకరినొకరు సులభంగా అర్థం చేసుకుంటారు. వారి అవసరాలను తీర్చుకుంటాయి. ఈ జంట మధ్య మంచి అవగాహన ఉంటుంది. తొందరగా గొడవలు రావు.
మిథునం - కుంభం
ఇద్దరూ సృజనాత్మకంగా, ఊహాత్మకంగా ఉంటారు. వారు తమ భాగస్వామి స్వేచ్ఛకు అంతరాయం కలిగించకుండా వీలైనంత ఎక్కువ సమయం కలిసి గడపడానికి ప్రయత్నిస్తారు. ఈ రెండు రాశుల మధ్య కూడా అనుకూలతలు చాలా ఎక్కువగా ఉంటాయి.
కర్కాటకం - మీనం
ఈ రెండు రాశుల వారి మధ్య బలమైన అవగాహన ఉంటుంది. ఈ రెండు రాశుల వారికి వివాహ అనుకూలత అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ కాలం కలిసి ఉండటానికి సహాయపడుతుంది.
సింహ - ధనుస్సు
ఈ రెండు రాశుల వారి అభిరుచులు బాగా కలుస్తాయి. వారు జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ది బెస్ట్ కపుల్ అవ్వగలరు.
కన్య - వృషభ రాశి
ఈ రెండు రాశులు చాలా నిజాయితీపరులు. ఈ రెండు రాశులు వివాహం చేసుకుంటే, ఆ సంబంధం జీవితాంతం మంచి అవగాహనతో కొనసాగుతుంది.
తుల - మీన రాశి
ఈ రెండు రాశులు కలిసి వైవాహిక జీవితం ప్రారంభిస్తే, వారి లైఫ్ ఆనందంగా ఉంటుంది. వారి సంబంధం అదే సమయంలో చాలా బలంగా,అందంగా ఉంటుంది. వారు కలిసి ఉంటే, వారు జీవితాంతం ఉత్తమ జంట అవుతారు. మంచి స్నేహితుల్లా ఉంటారు.