Zodiac signs: ఈ రాశులవారు ప్రతి చిన్నదానికీ భయపడతారు..!
చాలా మంది చాలా విషయాలకు భయపడటం చాలా సహజం. కానీ అతిగా ఆలోచించి భయపడేవారు కూడా కొందరు ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం కూడా అలాంటి రాశులు కొన్ని ఉన్నాయి.

భయపడే రాశులు..
కొందరికి చీకటి అంటే భయం, మరి కొందరికి నీళ్లంటే భయం. చాలా విషయాలకి ఊరికే భయపడేవారిని మీరు చూసే ఉంటారు. కొందరు మాత్రం ఏదీ లేకపోయినా భయపడతారు.అంతా బాగానే ఉన్నా కూడా ఏదైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం, ఆ రాశులేంటో చూద్దాం..
1.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. చాలా సెన్సిటివ్ కూడా.జీవితం ప్రశాంతంగా ఉన్నా కూడా చిన్న చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారు. తమ స్నేహితులు, బంధువులు, ప్రేమించిన వారు దూరమైపోతారేమో అనే భయం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంటారు. ఏ పని చేసినా ఫెయిల్ అయిపోతామేమో అని వీరు భయపడతారు. తమకు తెలిసినవాళ్లు కాస్త తేడాగా ప్రవర్తించినా కూడా నెగిటివ్ గా ఆలోచించేస్తారు. అతి జాగ్రత్త కారణంగా వీరు ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ, ఈ రాశివారు కాస్త పాజిటివ్ గా ఉండి, వారిని వారు నమ్ముకొని మనశ్శాంతిగా ఉంటే.. జీవితం సంతోషంగా ఉంటుంది.
కన్య రాశి..
కన్య రాశి వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు, అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తారు. కానీ ఇదే కొన్నిసార్లు సమస్య అవుతుంది. చిన్న చిన్న తప్పులను కూడా పట్టేస్తారు. ఏదైనా తేడా వస్తే, ఫెయిల్ అవుతామేమో అని భయపడతారు. ఏ పని చేసినా పూర్తిగా దానిమీదే దృష్టి పెడతారు. గెలిచినా ఇంకా బాగా చేయాలనుకుంటారు. దీనివల్ల ప్రశాంతంగా ఉండలేరు. తప్పులు జరుగుతాయేమో అని భయపడతారు.దీని వల్ల వీరు సమస్యలు తెచ్చుకుంటారు.
వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ ఏదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. జీవితం బాగున్నా "ఏదో తప్పు ఉంది!" అని అనుకుంటారు. ఎవరైనా మోసం చేస్తారేమో అని భయపడతారు. ఎందుకంటే వాళ్ళు బలమైన బంధాలను కోరుకుంటారు. కానీ నమ్మకం పోతుందేమో అని భయపడతారు. వాళ్ళ బంధాల గురించి, అవకాశాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల టెన్షన్ పెరుగుతుంది. ప్రతి మంచి విషయంలోనూ చెడు ఉండదు అని గుర్తించాలి.
మకర రాశి..
మకరం రాశి వాళ్ళు జాగ్రత్తగా, ప్రాక్టికల్‌గా ఉంటారు. సక్సెస్ కావాలని అనుకుంటారు. కానీ కష్టపడి సంపాదించుకున్న సక్సెస్ పోతుందేమో అని భయపడతారు. ఎప్పుడూ "చెడుకి సిద్ధంగా ఉండాలి" అనుకుంటారు. ఏదైనా ఫెయిల్ అయితే ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉంటారు. కానీ ఈ భయం వల్ల ప్రశాంతంగా ఉండలేరు. సక్సెస్‌ని ఆస్వాదించడం, మంచి క్షణాలను పూర్తిగా అనుభవించడం నేర్చుకోవాలి.