MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Ugadi 2026: పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ఈ ఏడాది మేష రాశి వారికి ఎలా ఉండనుంది?

Ugadi 2026: పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ఈ ఏడాది మేష రాశి వారికి ఎలా ఉండనుంది?

 Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది నుండి మేష రాశి వారికి కాలం చాలా కీలకంగా ఉండబోతోంది. పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది మేష రాశివారికి రాజయోగం లభించనుంది. అయితే.. అటు రాజయోగంతో పాటు.. కొన్ని సమస్యలు కూడా రానున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 06 2026, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మేష రాశి ఉగాది ఫలితం..
Image Credit : Asianet News

మేష రాశి ఉగాది ఫలితం..

2026 ఉగాది తర్వాత మేష రాశివారి జాతకం ఎలా ఉందో చూద్దాం..

1.కెరీర్ ( ఉద్యోగం)..

జూన్ 2026 తర్వాత గురు గ్రహం మంచి స్థాయిలోకి వస్తాడు. దీని కారణంగా ఈ రాశివారి కెరీర్ గొప్పగా మారిపోనుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో ఉండటం వల్ల.. మేష రాశివారికి కాస్త పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు చేసే పనికి గుర్తింపు రావడానికి కొంత సమయం పట్టొచ్చు... కానీ, ఫలితం తప్పకుండా దక్కుతుంది.

మేష రాశికి చెందిన రాజకీయ నాయకులకు ఈ ఏడాది ద్వితీయార్థం కొంత సవాలుగా ఉంటుంది. కాబట్టి, పదవుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
2.వ్యాపారం, ఆర్థికం..
Image Credit : our own

2.వ్యాపారం, ఆర్థికం..

ఆదాయం.. ఈ ఏడాది మీకు ఆదాయం 11, వ్యయం 5 కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి.. ఆర్థికంగా నిలకడగా ఉంటారు.

పెట్టుబడులు: కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మార్చి నుండి జూన్ వరకు చాలా అనుకూలమైన సమయం. రియల్ ఎస్టేట్ లేదా వాహనాల కొనుగోలుకు కూడా ఇది మంచి సమయమే.

లాభాలు: గతంలో నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అయితే సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12 మధ్య ఆర్థిక నిర్ణయాల్లో అప్రమత్తంగా ఉండాలి.

33
3. ఆరోగ్యం:
Image Credit : Getty

3. ఆరోగ్యం:

శారీరక స్థితి: ఈ ఏడాది ఆరోగ్య పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరక బలహీనత లేదా పాత అనారోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది.

మానసిక ఒత్తిడి: 12వ ఇంట్లో శని సంచారం వల్ల నిద్రలేమి, మానసిక ఆందోళన కలగవచ్చు. ధ్యానం (Meditation) , యోగా అలవాటు చేసుకోవడం మంచిది.

4. ఏలినాటి శని ప్రభావం:

మేష రాశి వారికి 2026 నుండి ఏలినాటి శని (Sade Sati) మొదటి దశ ప్రారంభమవుతుంది. దీనివల్ల కొన్ని పనుల్లో జాప్యం, అనవసర ప్రయాణాలు, ఖర్చులు పెరగవచ్చు. క్రమశిక్షణతో ఉంటే శని ఇచ్చే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు & పరిహారాలు:

గ్రహ శాంతి: శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున హనుమంతుడిని పూజించడం లేదా సుందరాకాండ పారాయణం చేయడం చాలా మంచిది.

దానం: మాతృమూర్తి లాంటి వృద్ధ మహిళలకు పాలు, చక్కెర లేదా తెలుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

సహనం: సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ గొడవలకు దిగకుండా శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Ugadi 2026: ఉగాది తర్వాత ఈ రాశుల తలరాత మారిపోతుంది, పట్టిందల్లా బంగారమే..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved