Zodiac sign: ఈ 3 రాశుల వారికి లక్కీ టైమ్ మొదలైనట్లే.. చంద్ర సంచారంతో ఇక అంతా మంచే
Zodiac sign: చంద్రుడి మార్పు మనుషుల జీవనంపై భారీగా ప్రభావం చూపుతుందని పండితులు చెబుతుంటారు. వసంత పంచమి రోజున అలాంటి ఓ కీలక మార్పు జరగనుంది. దీంతో 3 రాశుల వారికి కలిసిరానుంది. ఇంతకీ ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

వసంత పంచమి రోజు చంద్ర సంచారం
వసంత పంచమి శుభ సందర్భంలో చంద్రగ్రహం రాశి మార్పు చేసింది. ఈ ఖగోళ మార్పు జనవరి 23 ఉదయం 8.34 గంటలకు జరిగింది. ఈ సమయంలో చంద్రుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించాడు. ఈ సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపినా, కొన్ని రాశులకు మాత్రం ఊహించని లాభాలు అందే అవకాశం కనిపిస్తోంది.
చంద్రుడి సంచారం ఎందుకు కీలకం?
ఆస్ట్రాలజీ ప్రకారం చంద్రుడి గమనం చాలా వేగంగా జరుగుతుంది. ఒక రాశిలో చంద్రుడు రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు. తక్కువ సమయంలోనే మనసు, భావోద్వేగాలు, నిర్ణయాలపై బలమైన ప్రభావం చూపే శక్తి చంద్రుడికి ఉంటుంది. అందుకే చంద్ర సంచారం జరిగే ప్రతి దశను జ్యోతిషంలో ప్రత్యేకంగా పరిగణిస్తారు.
వృషభ రాశి: కెరీర్ లో ఎదుగుదల
ఈ సంచారం వృషభ రాశి వారికి అనుకూలంగా మారనుంది. ఉద్యోగం చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. పదోన్నతి గానీ, బాధ్యతలు పెరగడం గానీ జరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధించగలరు. కళలకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి పేరు వస్తుంది. రుణ భారం తగ్గే అవకాశం కనిపిస్తోంది. వాహనం కొనాలనుకునే వారికి అనుకూల సమయం.
వృశ్చిక రాశి: చదువు, పోటీ పరీక్షల్లో విజయం
వృశ్చిక రాశికి చంద్రుడు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ దశలో చదువుపై దృష్టి పెరుగుతుంది. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం బలపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అవి భవిష్యత్తుకు మేలు చేసేలా ఉంటాయి. మనసుకు ప్రశాంతత పెరుగుతుంది.
ధనస్సు రాశి: ఆర్థిక లాభాలు, కుటుంబ సంతోషం
ధనస్సు రాశికి చంద్రుడు నాలుగో స్థానంలో ప్రవేశించాడు. ఇది చాలా శుభసూచకం. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. కళారంగంలో ఉన్నవారికి అవకాశాలు విస్తరిస్తాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

