Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అప్పుల నుంచి ఉపశమనం.. నిరుద్యోగుల కలలు సాకారం!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 05.03.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభ రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.
మిథున రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన విషయంలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహ రాశి ఫలాలు
ఆత్మీయులు నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కన్య రాశి ఫలాలు
కొత్త అప్పులు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉంటాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
తుల రాశి ఫలాలు
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులు డబ్బు సహాయం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ఆదాయం బాగుంటుంది.
వృశ్చిక రాశి ఫలాలు
అప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు వ్యవహారాలు కలిసివస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది.
మకర రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలిసిరావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
కుంభ రాశి ఫలాలు
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో తోటివారితో సఖ్యత కలుగుతుంది.
మీన రాశి ఫలాలు
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాజకీయవర్గాల వారికి పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.

