MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • White Rice: ఇలా అన్నం తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు...!

White Rice: ఇలా అన్నం తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు...!

White Rice: బరువు తగ్గాలని అన్నం తినడం మానేస్తున్నారా? కానీ, అన్నం మానేయాల్సిన అవసరం లేకుండా కూడా ఈజీగా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా? ఎలా తినాలో తెలిస్తే చాలు..

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 28 2026, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
white rice
Image Credit : Getty

white rice

ప్రస్తుత కాలంలో అధిక బరువు తగ్గించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు జిమ్ లో గంటలు తరబడి కసరత్తులు చేస్తుంటే, మరి కొందరు తిండి తినడం మానేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా.. అన్నం తినడం తగ్గించేస్తారు. దీనికి బదులు... సలాడ్లు, రోటీలు లాంటివి తింటూ ఉంటారు. కానీ, అవి తినడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే, రోజూ అన్నం తింటూ కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 అన్నం తింటే బరువు పెరుగుతారా?
Image Credit : Getty

అన్నం తింటే బరువు పెరుగుతారా?

అన్నం తింటే బరువు పెరుగుతామనే భావన చాలా మందికి ఉంటుంది.కానీ,అన్నం తినే బరువు కూడా తగ్గొచ్చు. అయితే.. వేడి వేడి అన్నానికి బదులు, చల్లారిన తర్వాత అన్నం తింటే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

చద్దన్నంతో బరువు ఎలా తగ్గుతారు..?

అన్నం వండిన వెంటనే.. వేడి వేడిగా తిన్నప్పుడు.. అందులోని పిండి పదార్థం త్వరగా జీర్ణమైపోతుంది. మీ శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అయితే.. అలా కాకుండా అన్నం వండిన తర్వాత 12 నుంచి 24 గంటల పాటు ఫ్రిజ్ లో నిల్వ చేసినప్పుడు అందులోని పిండి పదార్థం... రెసిస్టెంట్ స్టార్చ్ గా మారుతుంది. ఈ పిండి పదార్థం సులభంగా జీర్ణమవ్వదు. అంటే.. మన శరీరానికి చాలా తక్కువ కేలరీలు అందుతాయి.

Related Articles

Related image1
No signal in Lift: లిఫ్ట్ లో ఫోన్ సిగ్నల్ ఎందుకు రాదు..?
Related image2
Chapati Dough: చపాతీ పిండి నల్లగా మారిందా? ఇలా చేస్తే రెండు రోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది
33
ఆకలి వేయదు....
Image Credit : Getty

ఆకలి వేయదు....

రెసిస్టెంట్ స్టార్చ్ మంచి ఫైబర్ లా పని చేస్తుంది. ఇది చాలా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. దీని వల్ల ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆకలి వేయదు.జంక్ ఫుడ్ తినాలనే కోరిక కూడా కలగదు. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి చద్దన్నం...

చల్లటి అన్నం తినడం వల్ల శరీరంలోకి షుగర్ నెమ్మదిగా విడుదల అవుతుంది. ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇది కొవ్వు పేరుకుపోవడాన్ని నెమ్మదిస్తుంది. అదనంగా, ఇది ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడానికి అన్నం ఎలా తినాలంటే...

అన్నం పూర్తి ప్రయోజనాలను పొందడానికి, దానిని మామూలుగా వండండి. వండిన తర్వాత, దానిని చల్లారనిచ్చి 12 నుండి 24 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. మరుసటి రోజు, దానిని తినాలి. కావాలనుకుంటే, వండేటప్పుడు కొద్దిగా కొబ్బరి నూనెను జోడించవచ్చు. కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా చేర్చుకోవచ్చు. ఇలా తింటే బరువు తగ్గొచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Related Stories
Recommended image1
No signal in Lift: లిఫ్ట్ లో ఫోన్ సిగ్నల్ ఎందుకు రాదు..?
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి నల్లగా మారిందా? ఇలా చేస్తే రెండు రోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved