- Home
- Astrology
- Fridge: మీ ఫ్రిజ్ మీద ఏవేవో కాదు.. ఈ మూడు వస్తువులు పెట్టండి, తర్వాత జరిగే మ్యాజిక్ ఇదే
Fridge: మీ ఫ్రిజ్ మీద ఏవేవో కాదు.. ఈ మూడు వస్తువులు పెట్టండి, తర్వాత జరిగే మ్యాజిక్ ఇదే
Fridge: మీరు ప్రిజ్ మీద ఎలాంటి వస్తువులు పెడుతున్నారు? ఫ్రిజ్ మీద ఉంచే వస్తువులు కొన్ని పేదరికాన్ని తీసుకువస్తే… మరి కొన్ని అదృష్టాన్ని పెంచుతాయి. ముఖ్యంగా ఫ్రిజ్ పై మూడు వస్తువులు పెడితే ఆర్థికంగా బాగా కలిసొస్తుంది.
ఫ్రిజ్ మీద ఏం పెట్టాలో తెలుసా?
వాస్తు శాస్త్రం మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మనం ఇంట్లో చేసే చిన్న చిన్న పనులు కూడా మన ఆర్థిక పరిస్థితి ని ఎఫెక్ట్ చేస్తాయి. చాలా మంది.. తమ ఇంట్లో ఫ్రిజ్ మీద పనికిరావు అనుకునే వస్తువులన్నీ పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల.. ఆ ఇంట్లో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా.. ఫ్రిజ్ మీద కొన్ని వస్తువులు ఉంచడం వల్ల.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం…
ఇత్తడి తాబేలు..
వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే మంచిదని భావిస్తారు. తాబేలును విష్ణుమూర్తి కూర్మావతారంగా, లక్ష్మీదేవి రాకగా పరిగణిస్తారు. మీరు మీ ఇంటత్లో ఫ్రిజ్ పైన ఉత్తరం లేదా తూర్పు దిశకు ముఖం పెట్టి ఉన్న ఒక చిన్న తాబేలు బొమ్మ ఉంచాలి. దీని వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి.
వెదురు మొక్క…
వాస్తు శాస్త్రంలో వెదురు మొక్కను అభివృద్ధి, సంతోషం, పాజిటివ్ ఎనర్జీ కి చిహ్నంగా భావిస్తారు. ఒక గాజు పాత్రలో నీరు పోసి ఈ మొక్కను ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషాలు పెరుగుతాయి. రాహు దోషాలు తగ్గుతాయి. సంపద పెరుగుతుంది.
3. రాగి చెంబు..
మర్చిపోయి కూడా ఫ్రిడ్జ్ మీద వీటిని పెట్టొద్దు
మందులు (Medicines): ఫ్రిడ్జ్ పైన మందులు అస్సలు పెట్టకూడదు. వాస్తు ప్రకారం, ఇది ఇంట్లో అనారోగ్యాలను పెంచుతుంది. మీ సంపాదనలో ఎక్కువ భాగం హాస్పిటల్ ఖర్చులకే పోతుంది.
మిక్సర్-గ్రైండర్ లేదా మైక్రోవేవ్: ఇలాంటి బరువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఫ్రిడ్జ్ పైన పెడితే, రెండు యంత్రాల శక్తులు ఒకదానికొకటి ఢీకొంటాయి. దీనివల్ల ఇంట్లో మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు పెరుగుతాయి.
తాళాలు (Keys): ఫ్రిడ్జ్ పైన తాళాలు పెట్టడం వల్ల ఇంటి ఆర్థిక అభివృద్ధి, కొత్త అవకాశాలు 'లాక్' అయిపోతాయి.

