Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కొత్త అవకాశాలు.. లాభదాయకమైన పరిచయాలు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 03.06.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి తప్పదు. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి.
వృషభ రాశి ఫలాలు
రాజకీయ వర్గాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం మరింత పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిథున రాశి ఫలాలు
విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో విభేదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.
సింహ రాశి ఫలాలు
బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
కన్య రాశి ఫలాలు
విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.
తుల రాశి ఫలాలు
కుటుంబ సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
వృశ్చిక రాశి ఫలాలు
సమాజంలో మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.
మకర రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి విలువైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగుల కలలు సాకారం అవుతాయి.
కుంభ రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
మీన రాశి ఫలాలు
మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.

