Jupiter Transit: జూన్ 18 నుండి ఈ 3 రాశుల వారి దశ తిరుగుతుంది, గురు గ్రహం వల్ల ప్రమోషన్
Jupiter Transit: గురుగ్రహం శుభ స్థానంలో ఉంటే ప్రతి ఒక్కరి జీవితం ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. జూన్ 18న గురుగ్రహం పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించబోతుంది. దీనివల్ల 3 రాశుల వారికి మంచి కాలం వస్తుంది.

పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం
జ్యోతిషశాస్త్రం ప్రకారం అదృష్టాన్ని, సంతానాన్ని అందించేది గురు గ్రహమే. గురు గ్రహం శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తికి అన్ని రకాలుగా శుభఫలితాలు కలుగుతాయి. గురు గ్రహం నెమ్మదిగా కదిలేది. ప్రస్తుతం కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. పునర్వసు నక్షత్రంలో ఉంది. కానీ అతి త్వరలో జూన్ 18న రాత్రి 9:32 గంటలకు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించబోతుంది. నెలరోజుల పాటు అంటే ఆగస్టు 18 వరకు అక్కడే ఉంటుంది. దీని వల్ల మూడు రాశుల వారికి విపరీతమైన శుభ ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి
గురు గ్రహం ధనుస్సు రాశి వారికి అత్యంత శుభప్రదంగా మారుతుంది. గురుగ్రహం ప్రభావం వల్ల వీరు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి కొత్త ఆదాయం మార్గాలు కనిపిస్తాయి. ఈ నెల రోజులు పాటు విద్యార్థులకు కూడా ఫలవంతంగా ఉంటుంది. ఇక వృత్తిగత జీవితంలో కొత్త కెరీర్ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రాశి వారు సానుకూల శక్తితో ముందుకు అడుగు వేస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు మత ధార్మిక కార్యకలాపాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వీరి జీవితం ఆనందంగా సాగుతుంది. ఇతరులతో సులువుగా కలిసిపోతూ హాయిగా జీవిస్తారు. ఇక ఉద్యోగంలో ఉన్నత హోదా, ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగానే ఉన్నాయి.
కన్య రాశి
గురు గ్రహ సంచారం కన్యారాశి వారికి ఎంతో అనుకూల ఫలితాలను అందిస్తుంది. కుటుంబం నుంచి వీరికి పూర్తిగా ప్రేమ, సపోర్టు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు. స్నేహితుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల మాత్రమే శ్రద్ధ పెడితే మంచిది.

