- Home
- Astrology
- Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు బంగారాలు...భర్తను నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటారు..!
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు బంగారాలు...భర్తను నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటారు..!
పెళ్లి తర్వాత భర్తను నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటారు. అంతేకాదు.. డబ్బు విషయంలో తమ భర్తకు ఎలాంటి అవసరం వచ్చినా తమ సపోర్ట్ ఇవ్వడంలో ముందుంటారు.

birth date
జోతిష్యశాస్త్రంలో న్యూమరాలజీ కూడా ఒక భాగం. ఈ సంఖ్యాశాస్త్రం మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మన పుట్టిన తేదీ ఆధారంగా ఆ వ్యక్తి జీవితం, వ్యక్తిత్వం, భవిష్యత్తు లాంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ న్యూమరాలజీ లో 1 నుంచి 9 వరకు సంఖ్యలు ఉంటాయి. గ్రహాల ఆధారంగా , ఆ తేదీన జన్మించిన వారి సంపద, శ్రేయస్సు, ప్రేమ మొదలైనవి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిల మనసు, వ్యక్తిత్వం బంగారంలా ఉంటుంది. పెళ్లి తర్వాత భర్తను నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటారు. అంతేకాదు.. డబ్బు విషయంలో తమ భర్తకు ఎలాంటి అవసరం వచ్చినా తమ సపోర్ట్ ఇవ్వడంలో ముందుంటారు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...
నెంబర్ 6....
న్యూమరాలజీ ప్రకారం, ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ నెంబర్ శుక్ర గ్రహంతో ముడిపడి ఉంటుంది. శుక్రుని దయ కారణంగా... ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైన వారు. వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా, ఈ తేదీలలో జన్మించిన మహిళలు భర్తకు అదృష్టాన్ని తెస్తారు. డబ్బు విషయంలో తమ భర్తకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటూ ఉంటారు.
డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు...
న్యూమరాలజీ ప్రకారం, ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు డబ్బు ఖర్చు చేయడానికి ఎప్పుడూ వెనకాడరు. చాలా ఉదారంగా డబ్బులు ఖర్చు చేస్తారు. ఖర్చు చేసినా కూడా వీరి చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన మహిళల జీవితం ఎప్పుడూ మధురంగా ఉంటుంది. వీరికి ఎక్కువగా ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. కొత్త కొత్త ప్లేసులను చుట్టేస్తూ ఉంటారు.
వివాహ జీవితం
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఈ మూడు తేదీలలో జన్మించిన మహిళలు కొంచెం ఎక్కువ భావోద్వేగానికి లోనవుతారు. చిన్న విషయాల గురించి చెప్పినా వారు వెంటనే భావోద్వేగానికి లోనవుతారు. అలాగే, ఈ తేదీలలో జన్మించిన మహిళలు వివాహం తర్వాత కూడా మంచి జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా వారు తమ భర్తకు అన్ని విషయాలలో మద్దతు ఇస్తారు. డబ్బు విషయంలో భర్తకు సపోర్ట్ ఇస్తారు. తమ భర్తను నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటారు. అమితమైన ప్రేమను పంచుతారు.
ఈ తేదీలో జన్మించిన మహిళలు తమ భర్త కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. అత్తమామలను కూడా కన్న తల్లిదండ్రుల్లా చూసుకోగలరు. వీరు చాలా ప్రేమగా, ప్రశాంతంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ తమ భర్త, వారి భర్త కుటుంబ అవసరాలను తీర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు.

