Zodiac signs: గురు గ్రహానికి అత్యంత ఇష్టమైన రాశులు ఇవి, సంపదకు లోటే ఉండదు..!
ఒక వ్యక్తి జాతకంలో గురు మంచి స్థితిలో ఉండి, వారికి గురు గ్రహ అనుగ్రహం ఉంటే.. వారు జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటుంది.

Guru Blessings
జోతిష్య శాస్త్రం ప్రకారం, గురువును దైవిక గురువుగా భావిస్తారు. గురు గ్రహాన్ని( బృహస్పతి) జ్ఞానం, సంపద, ఆర్థికం, ఆధ్యాత్మికత, శుభానికి అధిపతిగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో గురు మంచి స్థితిలో ఉండి, వారికి గురు గ్రహ అనుగ్రహం ఉంటే.. వారు జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రావు. మంచి సంపద కలుగుతుంది. మరి, గురుగ్రహం అనుగ్రహం ఎక్కువగా ఉన్న రాశులేంటో చూద్దామా...
1.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారిపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో గురు బలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఈ రాశివారికి సంపద, జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుంది. గురు గ్రహం ధనస్సు రాశిలోకి అడుగుపెట్టినప్పుడు.. వీరికి చాలా మేలు జరుగుతుంది. ఊహించని వైపు నుంచి సంపద వస్తుంది. కెరీర్ లో మంచి స్థాయికి వెళతారు. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు వస్తాయి. విద్యలో పురోగతి ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లగలరు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి.
2.మీన రాశి...
గురు గ్రహానికి ఇష్టమైన రాశులలో మీన రాశి కూడా ఒకటి. గురు గ్రహం అనుగ్రహం ఈ రాశివారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. గురు అనుగ్రహం కారణంగా వీరి సంపద పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు. ఈ గ్రహం.. ఈ రాశిలోకి ప్రయాణించినప్పుడు... మీన రాశి వారికి వ్యాపారంలో విజయం, సంపద సేకరణ , సమాజంలో గౌరవం లభిస్తాయి. కుటుంబ సంపద, పెట్టుబడులు, లాభాలు , సంపదను కూడబెడుతుంది. బృహస్పతి ప్రభావం కారణంగా, మీన రాశి వారు కళాత్మక, ఆధ్యాత్మిక లేదా సేవా వృత్తుల ద్వారా గొప్ప సంపదను సాధిస్తారు.
3.కర్కాటక రాశి..
గురువుకు నచ్చిన మరో ముఖ్యమైన రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో గురు గ్రహం చాలా బలంగా ఉంటాడు. ఈ గురు గ్రహం కారణంగా.. కర్కాటక రాశివారు సంపద, కుటుంబ సంక్షేమం, సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఊహించని సంపదను పొందగలరు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఈ గ్రహం కర్కాటక రాశిలోకి అడుగుపెట్టినప్పుడు.. వీరి ఆస్తులు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు..భారీ లాభాలను పొందగలరు.
4.వృశ్చికం
వృశ్చిక రాశికి గురు గ్రహం స్నేహపూర్వక రాశి. ఈ రాశిలోని బృహస్పతి అడుగుపెడితే.. సంపద పెరుగుతుంది. ఆధ్యాత్మిక బాటలో నడుస్తారు. ఈ సమయంలో వీరికి ఊహించని సంపద లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినా లాభాలు వస్తాయి. వ్యాపారంలో దూసుకుపోగలరు. కొత్త వ్యాపారాలు ప్రారంభించగలరు. ఉన్నత స్థాయికి ఎదగగలరు.
5.సింహ రాశి..
సింహ రాశిపై గురు గ్రహ అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహ ప్రభావం కారణంగా... సింహ రాశివారు నాయకత్వ లక్షణాలు లభిస్తాయి. మంచి సంపద పొందగలుగుతారు. సామాజిక హోదాను సాధించగలరు. వ్యాపారాల్లో రాణించగలుగుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అవకాశాలు పొందుతారు.