Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ పెళ్లి తర్వాత అద్భుతంగా మారిపోతుంది..!
కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారి జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోతుంది. అంటే.. పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత అద్బుతంగా మారుతుంది.

Birth dates
సంఖ్యా శాస్త్రం అనేది ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా వారి లక్షణాలను, భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉపయోగించే శాస్త్రం. అదేవిధంగా, న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తికి పుట్టిన తేదీని బట్టి, వారి జీవితంలో వారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో కూడా తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో.. కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారి జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోతుంది. అంటే.. పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత అద్బుతంగా మారుతుంది. చాలా సంతోషంగా, సంపన్నంగా మారుతుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా....
నెంబర్ 6..
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారంతా న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 6 కిందకు వస్తారు. వివాహం తర్వాత ఈ తేదీల్లో జన్మించిన వారి జీవితం ఆనందంగా మారుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారిపై శుక్ర గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి శుక్రుని ఆశీర్వాదం ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. దీని వల్ల వీరికి పెళ్లి తర్వాత ధనయోగం కూడా కలుగుతుంది. కెరీర్ లో గొప్ప పురోగతిని చూస్తారు. ప్రజలలో వారి గౌరవం కూడా పెరుగుతుంది.
నెంబర్ 8...
న్యూమరాలజీ ప్రకారం, ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టినవారిపై శని గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.శని దేవుని ఆశీస్సుల కారణంగా వీరికి చాలా మేలు జరుగుతుంది. వీరి కాస్త మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ, చాలా కష్టపడి పని చేస్తారు. వివాహం తర్వాత... వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మంచి స్థాయికి వెళతారు. కెరీర్ పరంగా కూడా చాలా గ్రోత్ ఉంటుంది.
నెంబర్ 9..
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 9, 18 , 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు 9 సంఖ్య కిందకు వస్తారు. ఈ తేదీలలో జన్మించిన వారిపై అంగారక గ్రహ ప్రభావం ఉంటుంది. కాబట్టి, వివాహం తర్వాత వారి జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతారు. అంగారకుడి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటాయి. దీని కారణంగా, వారికి ఎల్లప్పుడూ అధిక ఆత్మవిశ్వాసం , ధైర్యం ఉంటాయి. ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు వారి జీవిత భాగస్వామి మద్దతుతో వివాహం తర్వాత గొప్ప శ్రేయస్సును పొందుతారు. వారు వ్యాపారం, వృత్తిలో గొప్ప పురోగతిని చూస్తారు. ఆర్థికంగా కూడా మంచి వృద్ధి ఉంటుంది.