New Year: 2026 మొదలయ్యేలోగా ఈ దానాలు చేస్తే.. కొత్త సంవత్సరమంతా మీకు అదృష్టమే
New Year: 2025 ముగియడానికి వచ్చింది. మరి కొద్ది రోజుల్లో మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ న్యూఇయర్ ని మీకు శుభప్రదంగా మార్చుకోవాలి అనుకుంటే కొన్ని దానాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

2026
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం అంటే..ఆ సంవత్సరం మొత్తం సంతోషంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ.. గ్రహాలలో మార్పులు అన్నీ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు.దాని వల్ల అనుకోని సమస్యలు వస్తూనే ఉంటాయి.ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 2026 ప్రారంభం కాకముందే..రహస్యంగా కొన్ని దానాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా కొన్నింటినీ ఎవరికీ తెలియకుండా దానం చేయడం వల్ల సంవత్సరం మొత్తం సంతోషంగా సాగుతుంది. మరి, ఏం దానం చేయాలో ఇప్పుడు చూద్దాం..
రాగి పాత్ర...
శివుడి పూజలో శివాభిషేకం చాలా ముఖ్యమైనది. శివలింగానికి ఎల్లప్పుడూ రాగి పాత్రలోనే నీటిని సమర్పించాలి. శివునికి ప్రియమైన ఈ లోహపు పాత్రను కొత్త సంవత్సరం మొదటి రోజున రహస్యంగా దానం చేయాలి. ముఖ్యంగా కొత్త సంవత్సరానికి ముందే మీరు ఏదైనా శివాలయానికి దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కష్టాలు తీరి.. ఏడాది మొత్తం సంతోషంగా ఉంటారు.
అగ్గి పెట్టె..
మీరు ఎంత ప్రయత్నించినా, జీవితంలో కష్టాలు, ఇబ్బందులు ఎదురౌతున్నాయని మీకు అనిపిస్తే... ఈ కొత్త సంవత్సరం రాకముందే రహస్యంగా అగ్గిపెట్టెలు దానం చేయాలి. మంగళవారం రోజున ఏదైనా ఆలయంలో అగ్గిపెట్టలను వదిలేసి రావడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
దీప దానం
మీరు దీపాలను దానం చేయడం గురించి చాలా విని ఉంటారు, చదివి ఉంటారు, చూసి ఉంటారు. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు స్వచ్ఛమైన, నిజాయితీ గల హృదయంతో ఆలయంలో దీపాన్ని దానం చేస్తే, మీరు అపారమైన ప్రయోజనాలను పొందుతారు, కానీ దాని గురించి ఎవరితోనూ చర్చించకుండా జాగ్రత్త వహించండి. అంటే, మీరు చేసిన దీప దానం గురించి ఎవరికీ చెప్పవద్దు.
ఉప్పు
చాలా మంది దేవుని పట్ల భక్తికి చిహ్నంగా జాతరలు నిర్వహిస్తారు.కొత్త సంవత్సరానికి ముందు మీరు ఎక్కడైనా జాతర జరగడం చూస్తే, అక్కడ ఉప్పును దానం చేయవచ్చు. అయితే, దానిని రహస్యంగా ఉంచడం వల్ల మంచి పుణ్యం వస్తుంది. ఉప్పు కూడా చౌకైన వస్తువు కాబట్టి, మీరు దానిని సులభంగా దానం చేయవచ్చు. ఇది మీ ఇంట్లో సంపద, శ్రేయస్సును పెంచుతుంది.

