Shukraditya Yoga: శుక్రాదిత్య యోగంతో ఈ 3 రాశులకు పండగే పండగ.. స్థాయి పెరుగుతుంది
Shukraditya Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, శుక్రుడు ఒకే రాశిలో కలవడాన్ని శుక్రాదిత్య యోగం అంటారు. అక్టోబర్ 17, 2026న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించడంతో ఈ అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇది 3 రాశుల వారికి కలిసివస్తుంది.

మేష రాశి
మేష రాశి వారికి శుక్రాదిత్య యోగం వల్ల బాగా కలిసివస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా ఒకే ప్రాజెక్టుపై కష్టపడుతున్న వారు తమ టాలెంట్‌ను బాస్‌కు చూపించే ఛాన్స్ దొరుకుతుంది. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఇది మంచి సమయం. ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి అదనపు బాధ్యతలు ఇస్తారు. సొంతంగా వ్యాపారం చేసే వారు కొత్త కస్టమర్లను ఆకర్షించొచ్చు. అయితే, పెట్టుబడులు పెట్టే ముందు లాభనష్టాలను బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం.
కర్కాటక రాశి
శుక్రుడు, సూర్యుడు గ్రహాల కలయిక కర్కాటక రాశి వారికి ఉద్యోగ, ఆర్థిక పరంగా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆఫీసులో మీ సత్తా చాటుకోవడానికి మంచి వాతావరణం ఏర్పడుతుంది. కొత్త బాధ్యతలు తీసుకోవడంతో పాటు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు భవిష్యత్తులో ఉపయోగపడే కాంటాక్ట్స్ దొరుకుతాయి. అయితే, డబ్బు విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గిస్తే ఈ సమయంలోనే కాదు, ఎప్పటికీ మంచిదే.
తులా రాశి
శుక్రాదిత్య యోగం తులా రాశి వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే తులా రాశికి అధిపతి శుక్రుడే. సూర్యుడు ఈ రాశిలోకి వచ్చి శుక్రుడితో కలవడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలుగుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టొచ్చు లేదా ఉన్న బిజినెస్‌ను విస్తరించొచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో బాగా ఉపయోగపడతాయి. కానీ, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.

