- Home
- Astrology
- Zodiac Signs: డిసెంబర్లో ఈ 5 రాశులవారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు.. పట్టిందల్లా బంగారమే!
Zodiac Signs: డిసెంబర్లో ఈ 5 రాశులవారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు.. పట్టిందల్లా బంగారమే!
Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, డిసెంబర్ నెలలో శని, గురు, రాహు, కేతువు వంటి ముఖ్యమైన గ్రహాల గమనంలో మార్పులున్నాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి మేలు జరగునుంది. మరి గ్రహాల మార్పుతో అదృష్టం పొందే రాశులేవో, వారికి ఎలాంటి లాభాలుంటాయో చూద్దాం.

డిసెంబర్ నెలలో అదృష్టం పొందే రాశులు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ నెల చాలా ప్రత్యేకమైంది. ఈ నెలలో అనేక ముఖ్యమైన గ్రహాల స్థానాల్లో మార్పులు రానున్నాయి. దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారి జీవితాలపై కనిపిస్తుంది. డిసెంబర్లో శని మీన రాశిలో నేరుగా, దేవగురువు బృహస్పతి తిరోగమనంలో కదులుతారు. ఇవే కాకుండా రాహు-కేతువులు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు కూడా ఈ నెలలో తమ రాశులను మార్చుకుంటారు. ఈ గ్రహాల కదలికల వల్ల 5 రాశులవారిని అదృష్టం వరిస్తుంది. పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. మరి ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. లాభాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మీ సంపద స్థానంలో గురుడి సంచారం వల్ల ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాత పెట్టుబడుల నుంచి భారీగా డబ్బు వస్తుంది. కుటుంబంతో గడిపేందుకు డిసెంబర్ సరైన సమయం. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి డిసెంబర్ నెల అంతా పాజిటివ్‌గా ఉంటుంది. నిరంతరం లాభాలు ఆర్జించే అవకాశాలు పొందుతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు మళ్లీ ప్రారంభం కావచ్చు. మీరు మీ లక్ష్యాలను సాధించడంలో సఫలం అవుతారు. లావాదేవీల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది.
తుల రాశి
తుల రాశి వారికి డిసెంబర్ నెల ఎంతో శుభప్రదం, ప్రయోజనకరం. కెరీర్, వ్యాపార పరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీకు దక్కవచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కోరిక ఈ నెలలో నెరవేరుతుంది. వ్యాపారులకు ఈ నెలలో వ్యాపార విస్తరణతో పాటు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి డిసెంబర్ నెల బాగా కలిసి వస్తుంది. ఈ నెలలో మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. ఈ నెల మీకు ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. విద్యార్థులకు ఈ నెల చాలా విజయవంతంగా ఉంటుంది.
మీన రాశి
మీన రాశి వారికి డిసెంబర్ నెల ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల మొత్తం ఆర్థిక లాభాలు, మంచి అవకాశాలతో నిండి ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్, శాలరీ హైక్ వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు సంబంధించిన విషయాల్లో మీకు లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇంటా బయటా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.















