- Home
- Astrology
- Zodiac signs: ఈ రాశులవారికి మొండితనం చాలా ఎక్కువ, ఒక్కసారి డిసైడ్ అయితే..ఎవరిమాటా వినరు..!
Zodiac signs: ఈ రాశులవారికి మొండితనం చాలా ఎక్కువ, ఒక్కసారి డిసైడ్ అయితే..ఎవరిమాటా వినరు..!
మొండితనం కారణంగా కొన్నిసార్లు ఊహించని ప్రయోజనాలు పొందినా, కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

మొండితనం చాలా ఎక్కువ..
ప్రతి ఒక్కరిలోనూ ఎంత కొంత మొండితనం ఉంటుంది. ఎదుటివాళ్లు చెప్పింది నేను ఎందుకు వినాలి అనే భావన ఉంటుంది. కానీ.. కొందరి విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. వారు ఏదైనా విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే.. ఇక వెనక్కి తగ్గరు. అది తప్పు అయినా, ఒప్పు అయినా.. తాము చేసిందే కరెక్ట్ అనే భావనలో ఉంటారు. వీరి మొండితనం కారణంగా కొన్నిసార్లు ఊహించని ప్రయోజనాలు పొందినా, కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంది. జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా కొన్ని రాశులవారు ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మరి, ఆ రాశులేంటో చూద్దామా...
1.మేష రాశి..
మేష రాశివారు చాలా సహజంగా ధైర్యవంతులు. చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుపోతారు. వారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే, దానిని మళ్లీ మార్చుకోవడానికి ఇష్టపడరు. తాము తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలిసినా సరే.. దానిని మళ్లీ మార్చుకోవడానికి ఇష్టపడరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పినా కూడా వీరు వినిపించుకోరు. ఈ రాశి వారిలో సహజంగా ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే.. తమకు రాదు అని కూర్చోరు. నేర్చుకొని అయినా ఆ పని పూర్తి చేయాలి అనుకుంటారు. కానీ, ఇతరుల అభిప్రాయాలను మాత్రం వీరు తీసుకోరు. వినడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. ఈ మొండితనం కారణంగానే ఈ రాశివారు కొన్నిసార్లు సమస్యలు కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా వీరి మొండితనం కారణంగా చాలా మంది స్నేహితులు వీరికి దూరం అయ్యే అవకాశం ఉంది.
2.వృషభ రాశి...
వృషభ రాశివారిలోనూ మొండితనం చాలా ఎక్కువ. కానీ, ఆవేశంగా నిర్ణయాలు తీసుకోరు. ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచిస్తారు.. కానీ, తీసుకున్న నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఒకసారి డిసైడ్ అయితే.. వాళ్ల మాట తప్ప మరొకరి మాట వినరు. ఒకే మార్గంలో ప్రయాణం చేయాలని అనుకుంటారు. కొత్తవి ప్రయత్నించాలని వీరికి ఉండదు. ఈ రాశి వారి మొండితనం అందరికీ కనపడదు. ఇతరుల మాట విన్నట్లే నటిస్తారు.. కానీ వినరు. దీని కారణంగా చాలా మంది స్నేహితులు, బంధువులు బాధపడే అవకాశం ఉంటంది. ఫలితంగా వారికి దూరం అవుతారు. అంతేకాకుండా.. వీరు కొత్తగా చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల మంచి అవకాశాలను చేజార్చుకుంటారు.
3.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వారు బయటి ప్రపంచానికి ఎంతో మృదువుగా కనిపించినా, లోపల తాము నమ్మిన విషయాల పట్ల గట్టి భావనలు కలిగి ఉంటారు. వారి మొండితనం ఎక్కువగా భావోద్వేగాలకు ఆధారపడి ఉంటుంది. వారు ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఎవరిమీద అయినా ఒక అభిప్రాయం ఏర్పడితే.. దాన్నుంచి వెనక్కి తగ్గడం వారికి నచ్చదు. ఒక్కసారి మంచి అని నమ్మితే.. జీవితాంతం వారిని మంచిగానే చూస్తారు. లేదు.. ఒకరిపైన ఏదైనా చెడు అభిప్రాయం ఏర్పడితే.. వారు ఎంత మంచి చేయాలని చూసినా కూడా వీరికి నచ్చదు.
4.సింహ రాశి..
సింహ రాశి వారిలో గర్వంతో కూడిన మొండితనం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు సహజంగా.. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారు స్వతంత్ర ఆలోచన కలవారు, కానీ అదే సమయంలో ఇతరులు తమ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తే, వారు తట్టుకోలేరు. వారి మొండితనం తరచూ అహంకారంతో ముడిపడి ఉంటుంది. వారిలో ‘నేనే కరెక్ట్’ అనే ధోరణి బలంగా ఉంటుంది. వారికి గౌరవం ఎంతో ముఖ్యమైనది. ఎవరైనా తమ అభిప్రాయాన్ని ప్రశ్నిస్తే, వారు మౌనంగా గానీ, తీవ్రమైన ఎదురు మాటలతో గానీ స్పందిస్తారు.
5.వృశ్చిక రాశి...
వృశ్చికరాశి వారు చాలా లోతైన ఆలోచనలు చేసే వ్యక్తులు. వారు బయటకు తక్కువగా మాట్లాడతారు, కానీ వారి ఆలోచనలు, నిర్ణయాల విషయంలో చాలా గట్టిగా ఉంటారు. ఒకసారి ఏదైనా ఫిక్స్ అయితే, వారి ఆలోచన మార్చడం ఎవరి తరం కాదు. వారి మొండితనం సైలెంట్‌గా ఉంటుంది. వారి మనసు మార్చాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు వీరు మాత్రం మారరు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అనే రకం వీరు.
6.మకర రాశి..
మకర రాశి వారి మొండితనం క్రమశిక్షణతో నిండి ఉంటుంది. వీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తారు. తమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరీ వీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారు చాలా క్రమశిక్షణ, క్రమబద్ధత కలిగి ఉంటారు. ఒక మార్గాన్ని ఎంచుకున్నాక దానిని విడిచిపెట్టే అవకాశం చాలా తక్కువ. వారి మొండితనం వారిలో ఉండే ప్రొఫెషనలిజం కారణంగా ఉండవచ్చు. వారు ఎప్పుడూ “ప్లాన్” ప్రకారమే ముందుకు సాగాలని చూస్తారు. అనుకోని మార్పులు వారిని అసౌకర్యానికి గురిచేస్తాయి.
ఫైనల్ గా..
పైన పేర్కొన్న రాశుల వారు కొంత మొండిగా ఉండవచ్చు, కానీ అదే మొండితనం వారిని ప్రత్యేకంగా, విజయవంతంగా చేస్తుంది. అవసరమైతే వెనక్కి తగ్గగల గుణం కూడా అలవర్చుకుంటే, వారు వ్యక్తిగతంగా, సామాజికంగా ఇంకా మెరుగ్గా ఎదగగలుగుతారు. ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా, మిగతా వారు వారితో మరింత సుహృదయంగా, బంధాన్ని బలపరచే విధంగా వ్యవహరించవచ్చు. మొండితనం సరైన మార్గంలో వాడితే, అది మన లక్ష్యాలను చేరుకునే బలమైన ఆయుధంగా మారుతుంది.