Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిది మంచి మనసు, అందరికీ సహాయం చేస్తారు..!
ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తుల్లో సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరి ఆలోచనలు చాలా స్వతంత్రంగా ఉంటాయి ధైర్య సాహసాలు కూడా చాలా ఎక్కువ.
- FB
- TW
- Linkdin
Follow Us
)
birth date
న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని, ఆ వ్యక్తి ఆలోచనా ధోరణి, జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఈ రోజు నెంబర్ 1 లో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
ఏ నెలలో అయినా 1,10,19, 28 తేదీలలో జన్మించినవారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిపై సూర్యుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. సూర్యుని శక్తి వీరికి ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది.
సహజ నాయకత్వ లక్షణాలు...
నెంబర్ 1 లో పుట్టిన వ్యక్తుల్లో సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరి ఆలోచనలు చాలా స్వతంత్రంగా ఉంటాయి ధైర్య సాహసాలు కూడా చాలా ఎక్కువ. ఏదైనా కొత్త పని అయినా ముందుండి చేయగల ధైర్యం వీరిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తుల స్వభావం అయస్కాంతంలా ఉంటుంది.అంటే.. ఎవరినైనా ఆకర్షించేయగలరు. అందరికీ నచ్చేస్తారు. కానీ, వారి స్వభావం చాలా మొండిగా ఉంటుంది.
అహంకారం..
ఈ తేదీల్లో జన్మించిన వారు తాము చేసేదే కరెక్ట్, తాము ఏది మాట్లాడినా కరెక్ట్ అనే భానవలో ఉంటారు. ఈ క్రమంలో వీరికి అహంకారం చాలా ఎక్కువ. ఈ అహంకారంతో ఎక్కువగా సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ, వీరు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. వీరి మనసు మాత్రం చాలా మంచిది.
ప్రేమలో నిజాయితీ..
నెంబర్ 1 కి చెందిన వ్యక్తులు ప్రేమలో నిజాయితీగా, నిబద్ధతతో వ్యవహరిస్తారు. తమ భాగస్వామిపై పూర్తిగా నమ్మకంతో ఉండడంతో పాటు, స్వేచ్ఛను కూడా కోరుకుంటారు. వీరి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వల్ల ఎక్కువ మంది వీరిని ఇష్టపడతారు. కానీ, వారి కోపం, మొండితనం వల్ల కొన్ని సార్లు సంబంధాల్లో సమస్యలు తెచ్చుకుంటారు. బలమైన బంధాలను కొనసాగించాలంటే, స్పష్టమైన సంభాషణ, పరస్పర గౌరవం చాలా ముఖ్యమైనవి.
ఆరోగ్య ప్రభావం..
ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు శారీరకంగా, మానసికంగా చాలా యాక్టివ్‌గా ఉంటారు. కానీ అదే సమయంలో ఒత్తిడి, అలసటకి కూడా గురయ్యే అవకాశముంది. వీరికి సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ధ్యానం, యోగా వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. బిజీ షెడ్యూల్ వల్ల భోజనాల్ని దాటేయడం, నిద్ర పట్టకపోవడం వంటి విషయాలు గుండె, కంటి సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు తప్పనిసరి.
కెరీర్...
నంబర్ 1 వ్యక్తులు సాధారణంగా నాయకత్వ స్థానాల్లో మెరిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఇతరులను ప్రేరేపించడంలో, ముందుండి మార్గం చూపడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. వ్యాపారం, మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, కళలు, రచన, సినిమాలు, టెక్నాలజీ వంటి రంగాల్లో వీరు మంచి స్థాయికి ఎదగగలుగుతారు. CEO, టీం లీడర్, ఎంటర్‌ప్రెన్యూర్ వంటి పదవులు వీరికి బాగా సరిపోతాయి. అలాగే, స్టార్టప్‌లు, డిజిటల్ మార్కెటింగ్‌లోనూ సత్తా చూపగలుగుతారు.
కచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి ఇవే..
త్వరిత నిర్ణయాలు తీసుకోవడం కంటే, ముందుగా ఆలోచించి స్థిరంగా నిర్ణయం తీసుకోవడం మంచిది.ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. నాయకుడు అనగానే ఒంటరిగా కాకుండా బృందంతో ముందుకు వెళ్లాలి. ధ్యానం,మెడిటేషన్ లాంటివి చేస్తూ ఒత్తిడి తగ్గించుకోవాలి. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉండాలి.