- Home
- Astrology
- Birth Date: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి సక్సెస్ అంత ఈజీగా రాదు, ఒక్కసారి వస్తే మాత్రం..
Birth Date: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి సక్సెస్ అంత ఈజీగా రాదు, ఒక్కసారి వస్తే మాత్రం..
ఈ తేదీల్లో పుట్టిన వారికి సహనం, క్రమశిక్షణ వంటి మంచి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాల కారణంగానే వీరు సమాజంలో చాలా నమ్మకమైన వ్యక్తులనే గుర్తింపు తెచ్చుకుంటారు.

పుట్టిన తేదీ..
జోతిష్యం మాత్రమే కాదు.. న్యూమరాలజీ కూడా.. మన జీవితంలోని అనేక రహస్యాలను విప్పగల శక్తి కలిగి ఉంది. ఈ న్యూమరాలజీలో ఉండే అంకెలు కేవలం గణిత శాస్త్రంలోని నెంబర్లు మాబత్రమే కాదు.. మన భౌతిక జీవనాన్ని, విశ్వంలోని శక్తులతో అనుసంధానం చేసే మాధ్యమాలుగా పరిగణిస్తారు. ముఖ్యంగా మనం పుట్టిన తేదీని బట్టి.. మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. మరి, న్యూమరాలజీ ప్రకారం.. నాలుగు ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
నెంబర్ 4..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 4 కిందకు వస్తారు.ఈ తేదీల్లో పుట్టిన వారికి సహనం, క్రమశిక్షణ వంటి మంచి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాల కారణంగానే వీరు సమాజంలో చాలా నమ్మకమైన వ్యక్తులనే గుర్తింపు తెచ్చుకుంటారు.
రాహు ప్రభావం
సంఖ్యాశాస్త్రంలో నాలుగు సంఖ్యపై రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఇది ఒక ఛాయాగ్రహం.కనిపించకపోయినా, ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాహు అనుగ్రహం వల్లే, ఈ సంఖ్యకు చెందినవారు అనేక క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడగలుగుతారు. ఎలాంటి సమస్యైనా ఆచరణాత్మకంగా ఎదుర్కొనే శక్తిని వీరికి రాహు అందిస్తుంది.
విజయానికి స్థిరమైన మార్గం
ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వ్యక్తులు జీవితంలో మంచి ప్రణాళికతో ముందుకు సాగుతారు.వీరు జీవితంలో చాలా కష్టపడతారు. కానీ పాపం.. వీరికి విజయం తొందరగా దక్కదు. కానీ, ఒక్కసారి సక్సెస్ వచ్చిందా.. అది శాశ్వతంగా ఉంటుంది. వీరి జీవితం మౌనంగా సాగిన విజయయాత్రలా ఉంటుంది.కళాత్మకంగా కాకపోయినా, నిబద్ధతతో నిండి ఉంటుంది.
ఆపదలో ఆశ్రయం
ఈ సంఖ్యకు చెందినవారిలో ఉండే విశ్వాసం అసాధారణం. పరిస్థితులు కఠినంగా ఉన్నా, కుటుంబం లేదా స్నేహితుల్ని వీరు విడిచిపెట్టరు. కష్ట సమయంలో వీరి మౌన సహనం ఇతరులకు ధైర్యాన్ని ఇస్తుంది.
క్రమశిక్షణతో జీవనం
కలలు, ఊహలతో నడిచే ఈ ప్రపంచంలో, ఈ తేదీల్లో జన్మించిన వారు మాత్రం చాలా భిన్నంగా ఉంటారు. వీరు వాస్తవాలను ఆదర్శంగా పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. చాలా క్రమశిక్షణతో ఉంటారు.కానీ, ఒక్కోసారి వీరి ప్రవర్తన చాలా మొండిగా ఉంటుంది. తమ మనసులో ఉన్న విషయాన్ని తొందరగా బయటపెట్టరు. ఇతరుల భావాలను కూడా తొందరగా అర్థం చేసుకోలేరు.