MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Money in Dreams: కలలో డబ్బులు ఎలా కనిపిస్తే అదృష్టం? డబ్బు పోయినట్టు కనిపిస్తే ఏం జరుగుతుంది?

Money in Dreams: కలలో డబ్బులు ఎలా కనిపిస్తే అదృష్టం? డబ్బు పోయినట్టు కనిపిస్తే ఏం జరుగుతుంది?

Money in Dreams: కలలు రావడం సహజం. కలలో డబ్బులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కలల్లో డబ్బు దొరికినట్టు, మరొకసారి పోయినట్టు వస్తాయి.డబ్బు కలలు ఎలా వస్తే మంచిది? ఎలాంటి డబ్బు కలలు మంచివి కావు? వంటి అంశాలు ఇక్కడ ఇచ్చాము. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 20 2026, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డబ్బు కలలకు అర్థమేంటి
Image Credit : Chat gpt

డబ్బు కలలకు అర్థమేంటి

కలలు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. మనకు వచ్చే కలలకు ఏదో ఒక అర్థం ఉంటుందని పెద్దలు కూడా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా కలలో డబ్బు కనిపిస్తే ఎంతో మంది దాన్ని అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. అయితే కలలో డబ్బు కనిపించడం వల్ల కేవలం లక్ కలిసిరాదు. కొన్ని కలలు డబ్బు విషయంలో హెచ్చరిస్తాయి. అది మన ఆలోచనలు, మన పరిస్థితులు, మనలో ఉన్న భయాలు లేదా ఆశలను కూడా ఈ కలలు సూచిస్తాయి. కొందరికి ఈ కలలు సూచనగా చెప్పుకుంటారు. మరికొందరికి ఇది ఒక హెచ్చరికలా కూడా ఉండొచ్చు. అందుకే కలలో డబ్బు కనిపిస్తే దాని అర్థమేంటో తెలుసుకోండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
డబ్బు పోయినట్టు కనిపిస్తే
Image Credit : Getty

డబ్బు పోయినట్టు కనిపిస్తే

కలలో మీకు డబ్బు దొరికినట్టు కనిపిస్తే అది చాలా మంచి సూచనగా చెప్పుకోవాలి. త్వరలో మీ జీవితంలో మంచి అవకాశాలు వస్తాయని, అదృష్టం మీకు దక్కుతుందని చెప్పే సంకేతంగా భావించాలి. అలాగే మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కే సమయం వచ్చేస్తుందని అర్థం. కానీ కలలో డబ్బు పోయినట్లు కనిపిస్తే మాత్రం కొంత కంగారు పడాల్సిన విషయం. ఇది మీ జీవితంలో మీరు ఏదో కోల్పోతారనే విషయాన్ని సూచిస్తుంది. అలాగే డబ్బు విషయంలో భయం, టెన్షన్ అనుభవించే అవకాశం ఉంది. ఇలాంటి కల ఆర్థిక సమస్యలు వచ్చే సూచనను కూడా చెబుతుంది.

Related Articles

Related image1
Chanakya niti: ఈ ఒక్క ప్రదేశంలోకి ఎప్పుడూ అడుగు పెట్టకండి, సంపాదించుకున్న గౌరవం ఒక్క క్షణంలో పోతుంది
Related image2
Cost of Living: మనదేశంలో నెలకు ఎంత జీతం వస్తే ఒక కుటుంబం సంతోషంగా జీవించగలదో తెలుసా?
34
చిరిగిపోయిన నోట్లు కనిపిస్తే
Image Credit : Getty

చిరిగిపోయిన నోట్లు కనిపిస్తే

అలాగే కలలో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తున్నట్లయితే అది అంత మంచి కల కాదని అంటారు. ఇది భవిష్యత్తులో అనవసర ఖర్చులు పెరగవచ్చని లేదా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తుంది. మరోవైపు ఎవరైనా మీకు డబ్బు ఇస్తున్నట్టు కల వస్తే అది మంచి సంకేతంగా చెప్పుకోవాలి. మీకు ఆర్ధికంగా విజయం దక్కుతుందని, కొత్త అవకాశాలు లేదా లాభాలు వస్తాయని అర్థం. అలాగే కలలో డబ్బు లెక్కపెడుతున్నట్లయితే కనిపిస్తే జీవితంలో చాలా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారని అర్థం. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచన. పాత నోట్లు, చినిగిన నోట్లతో కూడిన డబ్బు కలలో కనిపిస్తే ఇబ్బందులు, ఒత్తిడి లేదా అప్పుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని అర్థం.

44
ఈ కలలు నిజమా?
Image Credit : Getty

ఈ కలలు నిజమా?

మొత్తానికి కలలో డబ్బు కనిపించడం అనేది భవిష్యత్తును చెబుతుందని అంటారు. మన మనసులో ఉన్న భావాలు, ఆలోచనలు, భయాలు, ఆశలు కలల రూపంలో బయటపడతాయి. మనం డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తే అలాంటి కలలు రావడం సహజం. అందుకే ఈ కలలను చూసి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే అతి ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు. బదులుగా వాటిని ఒక సూచనగా తీసుకుని మన జీవితంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి!
Recommended image2
Ketu Blessings: కేతువు ఆశీర్వాదంతో ఈ 6 రాశులవారికి రాజులాంటి జీవితం! మీ రాశి ఉందా?
Recommended image3
Navpanchama Yoga: శని శుక్రుల కలయికతో ఈ 5 రాశులకు పట్టనున్న అదృష్టం
Related Stories
Recommended image1
Chanakya niti: ఈ ఒక్క ప్రదేశంలోకి ఎప్పుడూ అడుగు పెట్టకండి, సంపాదించుకున్న గౌరవం ఒక్క క్షణంలో పోతుంది
Recommended image2
Cost of Living: మనదేశంలో నెలకు ఎంత జీతం వస్తే ఒక కుటుంబం సంతోషంగా జీవించగలదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved