ఈ వారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా?
Weekly Horoscope: ఈ వార ఫలాలు 9.11.2025 నుంచి 15.11.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ వారం రాశి ఫలాలు
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
వృషభ రాశి ఫలాలు
నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చాలా కాలంగా ఉన్న సమస్యలను క్రమక్రమంగా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పాత బాకీలు వసూలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలను రాజీ చేసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. వారం చివరన చేపట్టిన పనులు మందగిస్తాయి.
మిథున రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం లభించదు. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలు నచ్చవు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో కొంత జాప్యం తప్పదు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వారం చివరన ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
కర్కాటక రాశి ఫలాలు
ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. పాత విషయాలు గుర్తు చేసుకొని బాధపడతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వారం చివరలో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులుంటాయి.
కన్య రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. దాయదులతో స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ వర్గాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.వారం మధ్యలో కుటుంబ సభ్యులతో కలహాలు తప్పవు.
తుల రాశి ఫలాలు
ఇంటా బయటా నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆదాయ మార్గాలు తగ్గుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురైనా అదిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. వారం ప్రారంభంలో సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక రుణాలు నుంచి ఉపశమనం పొందుతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మకర రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వారం మధ్యలో వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది.
కుంభ రాశి ఫలాలు
అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగగైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఒక సంఘటన మానసికంగా బాధిస్తుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. వారం చివరలో శ్రమతో కానీ పనులు పూర్తికావు.
మీన రాశి ఫలాలు
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఇంట్లో శుభాకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.