ఈ 4 నెలల్లో పుట్టిన అబ్బాయిలు.. భార్యను మహారాణిలా చూసుకుంటారు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నెలల్లో పుట్టిన అబ్బాయిల ప్రేమ.. బాధ్యత, అంకితభావంతో కూడుకొని ఉంటుంది. వీరు ప్రేమను పంచే తీరు వేరు. గౌరవాన్ని చూపించే శైలి వేరు. వీరు భార్యను అమితంగా ప్రేమిస్తారు. మహారాణిలా చూసుకుంటారు. వారికోసం ఏమైనా చేస్తారు.

Birth Month Astrology
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని నెలల్లో పుట్టిన అబ్బాయిలు మంచి ప్రేమికులు. వీరు భార్యను హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. వీరి జీవితంలో భార్య అంటే జీవిత భాగస్వామి మాత్రమే కాదు.. ఆమె వారి ప్రపంచం, వారి శక్తి, వారి సంతోషాలకు మూలం. వారి దృష్టిలో ప్రేమ అంటే గౌరవం, అర్థం చేసుకోవడం, అంకితభావం. అందుకే వీరు తమ భార్యను మహారాణిలా చూసుకుంటారు. మరి ఆ ప్రత్యేకమైన నెలలేంటో తెలుసుకోండి.
మార్చి
జ్యోతిష్యం ప్రకారం మార్చిలో పుట్టిన అబ్బాయిలు చాలా నమ్మకంగా ఉంటారు. ఇతరులు చెప్పేది ఓపికగా ఉంటారు. వీరు లోతైన భావాలను కలిగి ఉంటారు. భార్యకు ప్రేమను మాటల్లో చెప్పడమే కాదు.. చేతల్లో చూపిస్తారు. వీరు భార్య మనసు గెలుచుకునే విధానం ప్రత్యేకం. ఆమె కోసం పాటలు పాడటం, చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇవ్వడం, తన మనసు అర్థం చేసుకొని.. అందుకు తగ్గట్టుగా నడుచుకోవడం వీరి ప్రత్యేకత.
మే
మే నెలలో పుట్టిన అబ్బాయిలు స్థిరమైన ప్రేమికులు. వీరికి సంబంధం అంటే శాశ్వతమైనది. భార్యకు అండగా ఉండటం, ప్రతి పరిస్థితిలో ఆమెను రక్షించటం వీరి సహజ స్వభావం. వీరి ప్రేమలో నిజాయితీ ఉంటుంది. భరోసా ఉంటుంది. ఈ అబ్బాయిలు మాటలు తక్కువగా మాట్లాడినా, వారి చేతల్లో ప్రేమను చూపుతారు. వీరి ప్రేమలో సహజమైన శ్రద్ధ ఉంటుంది. వీరు తమ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకొని జీవిస్తారు.
ఆగస్టు :
ఆగస్టులో పుట్టిన అబ్బాయిలు విశ్వాసపాత్రులు, అంకితభావం కలవారు. వీరి ప్రేమ చాలా శాంతియుతంగా ఉంటుంది. భార్యను గౌరవించడం వీరి సహజ స్వభావం. ఆమెను ప్రేమించడమే కాదు.. ప్రతి నిర్ణయంలో భాగస్వామ్యం కల్పిస్తారు. వీరి దృష్టిలో భార్య అంటే తన రాజ్యానికి రాణి. వీరి ప్రేమలో సౌమ్యత, స్థిరత్వం, ఆత్మీయత ఎక్కువగా ఉంటాయి.
నవంబర్
నవంబరులో పుట్టిన అబ్బాయిలు లోతైన భావాలతో నిండిన ప్రేమికులు. వీరు బయటికి కాస్త కఠినంగా కనిపించినా, లోపల అంతులేని ప్రేమ ఉంటుంది. భార్య బాధపడితే వీరి మనసు తట్టుకోలేదు. వీరు తమ ప్రేమను చేతల ద్వారా చూపిస్తారు. భార్యను సంతోషంగా ఉంచడం వీరికి ముఖ్యమైన పని. వీరు తమ ప్రేమలో అహంకారాన్ని దూరం పెట్టి, ఆత్మీయతను ముందుకు తీసుకెళ్తారు.