Weekly Rasi Phalalu: ఈ వారం ఓ రాశివారికి ఆఫీసులో సమస్యలు తప్పవు..!
ఈ వారం రాశి ఫలాలు పంచాగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ వార ఫలాలు 28.07.2025 నుంచి 2.08.2025 సంబంధించినవి.

1.మేష రాశి...
మేష రాశివారికి ఈ వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కాస్త మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక, వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అవసరం.చిన్న పొరపాటు చేసినా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. సడెన్ గా ప్రయాణాలు చేయాల్సిరావచ్చు. వారాంతంలో ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.
2.వృషభ రాశి...
వృషభ రాశివారికి ఈ వారం చాలా ఉత్సాహం ఉంటుంది. భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. శత్రువుల విషయాల్లో జాగ్రత్తలు అవసరం. వారం మధ్యలో అనవసర వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ వారాంతంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
3.మిథున రాశి...
మిథున రాశివారికి ఈ వారం ఒత్తిడితో మొదలయ్యే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అందరితో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ప్రయాణాలు చేసే ముందు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. “విష్ణు గరుడ వాహన” శ్లోకాన్ని పఠించడం మంచిది.
4.కర్కాటక రాశి...
ఈ వారం కర్కాటక రాశివారికి చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సంతానంతో అనుబంధం బలపడుతుంది. షాపింగ్, వినోదాల్లో ఆనందం. తల్లి ఆరోగ్యం, ఇంటి శుభ్రతపై శ్రద్ధ అవసరం. మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. వారాంతంలో మాటల వల్ల కొన్ని విషయాలు సాధించగలుగుతారు.
5.సింహ రాశి..
కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. గురువుల ఆశీర్వాదం, విదేశీ అవకాశాలు లభించవచ్చు. వారాంతంలో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.
కన్య రాశి
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు, బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. గణేశుని ఆరాధన ఫలితాలను మెరుగుపరుస్తుంది.
తులా రాశి
ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మైత్రి సంబంధాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత పొందవచ్చు. వారాంతంలో మంచి సమాచారంతో నెట్‌వర్కింగ్ పెరుగుతుంది.
వృశ్చిక రాశి
వారానికి మంచి శుభారంభం. మిత్రుల సహకారం, విజయాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ అవకాశాలు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు నియంత్రించండి. వారాంతంలో ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ అవసరం.
ధనుస్సు రాశి
ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి నైపుణ్యాలు పెరుగుతాయి. మధ్యలో సోదర వర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. వారాంతంలో ప్రయాణాలు, ముఖ్యుల సహకారం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం మేలు కలుగుతుంది.
మకర రాశి
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపార విస్తరణ, సంతాన అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మధ్యలో విదేశీ అవకాశాలు అందవచ్చు. వారం చివర్లో పౌరుషం పెరుగుతుంది. ఆకస్మిక ఖర్చులకు సిద్ధంగా ఉండండి.
కుంభ రాశి
విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. గృహ సమస్యలు ఎదురు కావచ్చు. వారం మధ్యలో ఏదైనా పని విషయంలో ఇతరుల సహాయం కోరుకునే అవకాశం ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తారు. వారాంతంలో కుటుంబ సహకారంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
మీన రాశి
మీన రాశి
ఆరంభంలో శక్తిని వినియోగించుకోవాలి. ఆరోగ్య సమస్యలు, వృత్తిపరమైన ఒత్తిడిని ఎదుర్కోవాలి. వారం మధ్యలో వాహన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది . శాంతంగా వ్యవహరించాలి. వారాంతంలో మంచి ప్రణాళికలు రూపొందించాలి. సత్యనారాయణ స్వామి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.