MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి సలహా కలిసివస్తుంది!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి సలహా కలిసివస్తుంది!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 24.02.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 24 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని విషయాల్లో పట్టుదలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.

Related Articles

Related image1
Ketu Transit: కేతువు నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Related image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు కొంచెం కష్టపడినా చాలు.. కోటీశ్వరులవుతారు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నూతన భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఉద్యోగ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరపు బంధువుల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి. స్థిరాస్థి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన రుణప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు కలిసివస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతాయి. క్రయవిక్రయాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయ సంబంధిత చర్చలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

డబ్బు పరమైన ఇబ్బందులు కొంత చికాకు కలిగిస్తాయి. కుటుంబ విషయాలపై పెద్దలతో చర్చిస్తారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. పాత మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు శుభవార్తలు వింటారు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు
Recommended image3
Rahu Planet: రాహువు ఈ రాశుల వారిని ఎల్లప్పుడూ కాపాడతాడు, డబ్బుకు లోటు రానివ్వడు
Related Stories
Recommended image1
Ketu Transit: కేతువు నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు కొంచెం కష్టపడినా చాలు.. కోటీశ్వరులవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved