MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు

 Birth Date: న్యూమరాలజీ ప్రకారం, నెమలి ఈక దగ్గర ఉంచుకోవడం వల్ల కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అపారమైన అదృష్టం పెరుగుతుంది. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. మరి, ఆ తేదీలేంటో చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 23 2026, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెంబర్ 1..
Image Credit : Getty

నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారు తమ పని ప్రదేశంలో.. లేదా తమ వాలెట్ లో చిన్న నెమలి ఈకను ఉంచుకోవడం వల్ల వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సూర్య రశ్మి తగిలేలా నెమలి ఈకను ఉంచుకుంటే ఇంకా మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెంబర్ 4..
Image Credit : Freepik

నెంబర్ 4..

ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహువు ప్రభావం ఉంటుంది. రాహువు ప్రభావం వల్ల ఈ రాశి వారికి తరచూ పనుల్లో ఆటంకాలు లేదా అకస్మాత్తుగా సమస్యలు వస్తూ ఉంటాయి. నెమలి ఈక రాహు దోషాన్ని హరిస్తుంది. వీరు తమ పడకగదిలో లేదా తలగడ కింద నెమలి ఈకను ఉంచుకుంటే పీడకలలు రావు, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

34
నెంబర్ 8...
Image Credit : Freepik

నెంబర్ 8...

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని దేవుడి ప్రభావం ఉంటుంది. శని ప్రభావం వల్ల వీరి జీవితంలో పోరాటం ఎక్కువగా ఉంటుంది. నెమలి ఈకను ఇంట్లోని పూజా గదిలో లేదా లాకర్‌లో ఉంచడం వల్ల శని దోషం తీవ్రత తగ్గుతుంది. ఇది వీరి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, అప్పుల బాధ నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

44
నెంబర్ 7...
Image Credit : Freepik

నెంబర్ 7...

ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై కేతువు ప్రభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారంతా చాలా ఆధ్యాత్మికంగా, పరిశోధనా పరంగా ముందుకు వెళ్లాలని అనుకుంటారు.వీరు నెమలి ఈకను తమ డైరీలో లేదా పుస్తకాల మధ్య ఉంచుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు దూరమై విజయం వైపు అడుగులు వేస్తారు.

నెమలి ఈకను ఎలా ఉంచాలి?

ఆర్థిక లాభం కోసం: మీ ఇంట్లోని దక్షిణ దిశలో ఉన్న బీరువా లేదా లాకర్‌లో నెమలి ఈకను ఉంచండి. దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది.

వాస్తు దోషం కోసం: ఇంటి ప్రధాన ద్వారం వద్ద మూడు నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. నెమలి ఈక ఎప్పుడూ విరిగిపోకుండా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దాన్ని నేల మీద పడేయకూడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్, ఎవరి మీదా ఆధారపడరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved