MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Venus Transit: కన్య రాశిలో రెండుసార్లు శుక్రుడి సంచారం.. ఈ 4 రాశులవారికి డబుల్ జాక్‌పాట్!

Venus Transit: కన్య రాశిలో రెండుసార్లు శుక్రుడి సంచారం.. ఈ 4 రాశులవారికి డబుల్ జాక్‌పాట్!

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని అత్యంత శుభ గ్రహంగా భావిస్తారు. ఈ ఏడాది శుక్రుడు రెండుసార్లు కన్య రాశిలో సంచరించనున్నాడు. ఈ అరుదైన సంచారం వల్ల 4 రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరి ఆ రాశుల్లో మీ రాశి ఉందో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : Feb 19 2026, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కన్య రాశిలో రెండుసార్లు శుక్రుడి సంచారం
Image Credit : stockPhoto

కన్య రాశిలో రెండుసార్లు శుక్రుడి సంచారం

జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహ సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రేమ, అందం, ఆర్థిక స్థితి, దాంపత్య సుఖానికి కారకుడైన శుక్రుడు ఈ ఏడాది రెండుసార్లు కన్య రాశిలో సంచరించడం విశేషం. ఆగస్టు 1న శుక్రుడు తొలిసారి కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 2 వరకు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత తన సొంత రాశి అయిన తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్లీ నవంబర్ 6న కన్య రాశిలో రెండోసారి సంచరిస్తాడు. కన్య రాశికి అధిపతి బుధుడు. శుక్రుడు, బుధుడు మిత్ర గ్రహాలు కాబట్టి ఈ సంచారం చాలా ప్రత్యేకమైందని పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశులవారు శుక్రుడి అనుగ్రహం పొందనున్నారో ఇక్కడ చూద్దాం.

25
వృషభ రాశి
Image Credit : our own

వృషభ రాశి

శుక్రుడు వృషభ రాశికి అధిపతి కాబట్టి ఈ సంచారం ఈ రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు ఈ సమయం కలిసివస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

Related Articles

Related image1
Saturn Mercury Conjunction: 30 ఏళ్ల తర్వాత మీనరాశిలో శని, బుధుల కలయిక.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్!
Related image2
Mars Transit: 5 రోజులు ఓపికపడితే చాలు.. ఈ 6 రాశులవారి సంపద రెట్టింపు కావడం ఖాయం!
35
కన్య రాశి
Image Credit : our own

కన్య రాశి

శుక్రుడు కన్య రాశిలోనే సంచరిస్తాడు కాబట్టి ఈ రాశివారికి శుక్రుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. వీరి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. పెళ్లికాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. భార్యా భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కెరీర్ పరంగా ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాల ద్వారా లాభాలు వస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

45
కుంభ రాశి
Image Credit : our own

కుంభ రాశి

కుంభ రాశి వారికి కూడా శుక్రుడి సంచారం కలిసివస్తుంది. వీరి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. భూమి, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి.

55
మకర రాశి
Image Credit : our own

మకర రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశివారికి శుక్రుడి సంచారం భాగ్యస్థానాన్ని ప్రభావితం చేస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్య, కొత్త అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా అద్భుతమైన లాభాలు ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం దక్కుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారు స్వయం కృషితో కోటీశ్వరులు అవుతారు..!
Recommended image2
Lunar Eclipse: తొలి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులపైనే ప్రభావం ఎక్కువ
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ రాశివారు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు!
Related Stories
Recommended image1
Saturn Mercury Conjunction: 30 ఏళ్ల తర్వాత మీనరాశిలో శని, బుధుల కలయిక.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్!
Recommended image2
Mars Transit: 5 రోజులు ఓపికపడితే చాలు.. ఈ 6 రాశులవారి సంపద రెట్టింపు కావడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved