Today Rasi Phalalu: నేడు ఈ రాశివారు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 19.02.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
వృషభ రాశి ఫలాలు
చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగులకు శ్రమ అధికమవుతుంది.
మిథున రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి ఆశించిన సహాయం లభించదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
కర్కాటక రాశి ఫలాలు
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
కన్య రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. డబ్బు పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
తుల రాశి ఫలాలు
స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటా బయటా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలో అధికారుల నుంచి కొంత ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చిక రాశి ఫలాలు
ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసే లాభాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
ధనుస్సు రాశి ఫలాలు
చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పని భారం వల్ల విశ్రాంతి ఉండదు.
మకర రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి.
కుంభ రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో తోటివారితో సఖ్యతగా వ్యవహరించడం మంచిది.
మీన రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలం. భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

