- Home
- Astrology
- Shukra Gochar: కృత్తిక నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 3 రాశులవారు కష్టాల నుంచి గట్టెక్కినట్లే!
Shukra Gochar: కృత్తిక నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 3 రాశులవారు కష్టాల నుంచి గట్టెక్కినట్లే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు త్వరలో సూర్యుని నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం మూడు రాశుల వారికి అదృష్టం తీసుకురానుంది. ఎప్పటినుంచో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం దక్కనుంది. మరి రాక్షసుల గురువు ప్రత్యేక ఆశీస్సులు ఎవరికి లభిస్తాయో చూద్దామా..

శుక్రుడి నక్షత్ర మార్పు
రాక్షసుల గురువు శుక్రుడు సమయానుసారం రాశులు, నక్షత్రాలు మారుస్తుంటాడు. ఏప్రిల్ లో శుక్రుడు, సూర్యుడు అధిపతిగా ఉండే కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం మూడు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తిగత, వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న చాలా సమస్యల నుంచి ఉపశమనం దక్కనుంది. మరి శుక్రుడి ఆశీస్సులు పొందే ఆ రాశులేంటో తెలుసుకుందామా..
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శుక్రుడి రాశిమార్పు శుభప్రదం. శుక్రుని దయతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. గతంలో ఎన్నడూ లేని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల, అధికారుల నుంచి ప్రశంసలు దక్కవచ్చు. ఎప్పటి నుంచో ఉన్న ఆస్తి వివాదాలు ముగుస్తాయి. వాహన యోగం ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. సంబంధాలు మెరుగుపడతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఇది శుభ సమయం. శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారి ఆత్మవిశ్వాసం, ధైర్యం మరింత పెరుగుతాయి. కొత్త ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి. మీ మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
తుల రాశి
శుక్రుడి నక్షత్ర మార్పు వల్ల తుల రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

