Mercury Transit: బుధుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారికి ఇక అన్నీ మంచి రోజులే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో బుధ గ్రహ సంచారం జరగనుంది. బుధుడి నక్షత్ర మార్పు కొన్ని రాశులవారి జీవితాల్లో ఊహించని శుభ ఫలితాలు తీసుకురానుంది. వ్యక్తిగత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక మార్పులు జరగనున్నాయి. మరి ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా..

బుధ గ్రహ సంచారం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచార ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు ఉంటాయి. తెలివితేటలకు కారకుడైన బుధుడు ఈ నెల 23న శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు 4 రాశులపై గొప్ప ప్రభావం చూపనుంది. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు విషయాల్లో వీరికి లాభాలుంటాయి. మరి ఆ రాశులేంటో చూసేయండి.
మేష రాశి
మేష రాశి వారికి ఇది చాలా శుభ సమయం. పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. చదువులో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో గౌరవం, ప్రశంసలు దక్కుతాయి. అదనపు బాధ్యతలను సైతం సకాలంలో పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి బుధుడి సంచారం చాలా అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. బహుళ ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వైవాహిక బంధం బలపడుతుంది. సంబంధాల్లో అపార్థాలు తొలగిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
కన్య రాశి
కన్య రాశి వారికి బుధుడి నక్షత్ర మార్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. తోబుట్టువుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పటినుంచో ఉన్న కోరిక నెరవేరుతుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
ధనుస్సు రాశి
బుధుడి సంచారం వల్ల ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వంలో మార్పులు కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇంటా బయటా మీ మాటలకు గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.

