Rahu venus Effects: ఈ మూడు రాశుల వారి తలరాత మార్చబోతున్న రాహువు శుక్రుడు
Rahu venus Effects: శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. కుంభరాశిలో ఇప్పటికే రాహువు ఉన్నాడు. దీంతో రాహువు శుక్రుడితో కలిసి ప్రత్యేక యోగాన్ని ఏర్పరుస్తాడు. ఇది కొన్ని రాశుల వారి జీవితాన్నే మారుస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి బాగా కలిసొస్తుంది.

శుక్ర రాహు సంయోగం
ఒక వ్యక్తి జాతకంలో రాహువు, శుక్రుడు మంచి స్థానంలో ఉంటే వారికి ఎన్నో విజయాలు దక్కుతాయి. వారు అనుకున్న విజయాలను సాధిస్తారు. ఇప్పుడు అలాంటి రోజులు వచ్చాయి. ఫిబ్రవరి 6, 2026న శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే రాహువు అక్కడ ఉన్నాడు. ఈ శుక్ర రాహు సంయోగం ఫిబ్రవరి నెలంతా కొనసాగుతుంది. 18 ఏళ్ల తర్వాత ఈ రాహు, శుక్రుడు కలిసి కుంభరాశిలో యోగాన్ని ఏర్పరచారు. ఇది మూడు రాశుల వారికి బాగా కలిసొస్తుంది.
మేష రాశి
మేషరాశి వారికి ఫిబ్రవరి నెల బాగా కలిసొస్తుంది. కుంభరాశిలో ఏర్పడే శుక్ర రాహు సంయోగం అనేది మేషరాశి వారికి విపరీతంగా కలిసొచ్చేలా చేస్తుంది. వీరి ప్రేమ జీవితం, కుటుంబం జీవితం ఎంతో బాగుంటుంది. ఇక ప్రభుత్వ పరీక్షలు రాసి ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగ వార్తలు అందుతాయి. ఇక వృత్తి, వ్యాపారంలో మేష రాశి వారికి తిరుగులేదు. వీరికి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి శుక్ర రాహు సంయోగం విపరీతంగా అనుకూల ఫలితాలను ఇస్తుంది. వీరికి అన్ని వైపుల నుంచి ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబంతో ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే వీరికి అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే ఇదే మంచి సమయం. బాగా కలిసొచ్చే కాలం కాబట్టి రిస్క్ చేయవచ్చు.
మకర రాశి
మకర రాశి వారు ఫిబ్రవరిలో లక్కీ అనే చెప్పుకోవాలి కుంభరాశిలో శుక్ర రాహు సంయోగం అనేది మకరరాశికి ఎంతో శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. జీవితంలో సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కుటుంబంలో సంతోషం, ప్రేమ పెరుగుతుంది. అయితే ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

