MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Illicit Relationship: జాతకంలో ఈ గ్రహాలు చెడు స్థానంలో ఉంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం పక్కా

Illicit Relationship: జాతకంలో ఈ గ్రహాలు చెడు స్థానంలో ఉంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం పక్కా

Illicit Relationship: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలోని గ్రహాల స్థితులు, గ్రహ కలయికలను బట్టి  ఆ వ్యక్తి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది.  అక్రమ సంబంధాలు పెట్టుకునే పరిస్థితిని తెచ్చే గ్రహాలు కొన్ిన ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ చెప్పాము. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 05 2026, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అక్రమ సంబంధాలకు కారణమైన గ్రహాలు
Image Credit : Instagram

అక్రమ సంబంధాలకు కారణమైన గ్రహాలు

ఇప్పుడు అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో ఏర్పడే గ్రహ స్థితులు ఈ అక్రమ సంబంధాలకు కారణం అవుతాయి. గ్రహాలలో శుక్రుడు ప్రేమ, లైంగిక కోరికలకు కారకుడిగా చెప్పుకుంటారు. ఒక రాహు గ్రహం భ్రమలు కలిగించే గ్రహం. అలాగే హద్దులు దాటే స్వభావాన్ని ఇస్తాడు.  ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు, రాహువు ఒకే ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంది.  లేదా ఆ రెండు గ్రహాలు పరస్పరం ఒకరికొకరిపై దృష్టి కలిగి ఉంటే ఆ జాతకుడు అక్రమ సంబంధం కలిగి ఉంటే అవకాశం ఎక్కువ.

కుజుడు కామోద్రేకానికి కారకుడు. అలాగే ధైర్యాన్ని కూడా అందిస్తాడు. కుజుడు, శుక్రుడి దృష్టి సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో కామ కోరికలు అధికంగా ఉంటాయి. అలాంటి సమయంలో ఆలోచనలు అదుపు తప్పి పరస్త్రీ లేదా పరపురుషుడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు.

24
జాతకంలో 7 ఇల్లు
Image Credit : gemini ai

జాతకంలో 7 ఇల్లు

ఒక వ్యక్తి జాతకంలో 7వ ఇల్లు వివాహాన్ని సూచిస్తుంది. ఇక 12వ ఇల్లు లైంగిక సుఖాన్ని సూచిస్తుంది. ఈ రెండు ఇళ్లపై రాహువు లేదా శని వంటి గ్రహాల ప్రభావం అధికంగా ఉంటే అక్రమ సంబంధాల సమస్య వస్తుంది. ఇలా ఉన్న వ్యక్తి వైవాహిక జీవితంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. వీరు అక్రమ సంబంధాల వైపు నడుస్తాడు.

Related Articles

Related image1
Powerful Zodiac signs: పుట్టుకతోనే ఈ 3 రాశులకు దైవశక్తి ఎక్కువ, భవిష్యత్తును అంచనా వేయగలరు
Related image2
Naga chaitanya sobhita: పెళ్లయ్యాక ఒక్కరోజూ కూడ వంట చేసి పెట్టలేదు, రోజూ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడమే
34
చంద్రుడి వల్ల
Image Credit : Gemini AI

చంద్రుడి వల్ల

చంద్రుడు పాప గ్రహం కాదు. అతడు మన మనస్సుకు కారకుడు. అయితే చంద్రుడు పాప గ్రహాలతో కలిపినప్పుడు లేదా నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మనస్సు చంచలంగా మారిపోతుంది. దీని వల్ల అనైతిక ఆలోచనలు వస్తాయి. పర స్త్రీలు, పర పురుషులు వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. ఇది చివరికి వివాహేతర సంబంధాలకు కారణం అవుతుంది.

44
జాతకంలో 8వ ఇల్లు
Image Credit : Gemini AI

జాతకంలో 8వ ఇల్లు

ఒక వ్యక్తి జాతకంలో 8వ ఇల్లు రహస్య జీవితాన్ని సూచిస్తుంది. ఈ ఎనిమిదో ఇంట్లో రాహువు ఉంటే ఆ వ్యక్తి తన ప్రేమ సంబంధాలను రహస్యంగా ఉంచుతాడు. ఇలాంటి వారు జాతకాన్ని చూపించుకుని దోష పరిహారం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇలాంటి రహస్యంగా వివాహేతర సంబంధాలు కొనసాగించవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Transit: కుంభ రాశిలో బుధుడి సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఉద్యోగాలు మారుతూనే ఉంటారు...ఒకే చోట పనిచేయలేరు..!
Recommended image3
Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశం.. ఈ మూడు రాశుల కెరీర్ లో అద్భుతమైన మార్పులు
Related Stories
Recommended image1
Powerful Zodiac signs: పుట్టుకతోనే ఈ 3 రాశులకు దైవశక్తి ఎక్కువ, భవిష్యత్తును అంచనా వేయగలరు
Recommended image2
Naga chaitanya sobhita: పెళ్లయ్యాక ఒక్కరోజూ కూడ వంట చేసి పెట్టలేదు, రోజూ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved