- Home
- Astrology
- Vasthu tips: మీ ఇంట్లో ఈ ప్లేస్ లో కానీ అద్దం పెట్టారంటే..వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది!
Vasthu tips: మీ ఇంట్లో ఈ ప్లేస్ లో కానీ అద్దం పెట్టారంటే..వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది!
వాస్తు ప్రకారం అద్దాలను ఎక్కడ ఉంచాలో, ఏ దిశలో ఉంచితే డబ్బు వద్దు అన్నప్పటికీ వస్తుందో

అద్దాల స్థానాలు
మన ఇల్లు శుభకరమైన శక్తులతో నిండాలని, అందులో సుఖసంతోషాలు పరవళ్లు తొక్కాలని అందరికి కోరిక. ఇందుకోసం వాస్తు శాస్త్రం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు చెబుతోంది. ముఖ్యంగా అద్దాల స్థానాలు శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది. కాబట్టి అద్దాలను ఎక్కడ ఉంచాలో తెలిస్తే, ఇంట్లో శుభ శక్తులు తేలికగా ప్రవేశిస్తాయని వాస్తు నిపుణుల అభిప్రాయం.
తూర్పు, ఉత్తర దిశలే శ్రేష్టం
తూర్పు, ఉత్తర దిశలే శ్రేష్టం తూర్పు దిశలో అద్దం ఉంచితే సూర్యోదయ శక్తిని ఇంట్లోకి తేచేస్తుందని నమ్మకం. ఉత్తర దిశలో అద్దం ఉంచడం కుబేరుని దిశ కాబట్టి సంపదకు అనుకూలంగా ఉంటుందంటారు. అయితే తలుపులకు నేరుగా అద్దం పెట్టకూడదు. శుభ శక్తులు తిరిగి వెళ్తాయని వాస్తు హెచ్చరిస్తోంది.
బెడ్‌రూమ్‌లో జాగ్రత్తలు అవసరం
బెడ్‌రూమ్‌లో జాగ్రత్తలు అవసరం బెడ్‌పై పడుకున్నపుడు అది అద్దంలో ప్రతిబింబించకూడదు. ఇది నిద్రలేమికి, దాంపత్య సమస్యలకు కారణమవుతుందని చెప్పబడుతోంది. కాబట్టి అద్దాన్ని పక్కగా పెట్టాలి లేదా గుడ్డతో కప్పాలి. ఈశాన్య దిశలో అద్దం పెట్టడం మంచిదికాదు.
ప్రవేశ ద్వారం దగ్గర ఎలా?
ఇంటి బయట అద్దాలు ఉండకూడదు. కానీ లోపల ప్రవేశ ద్వారానికి కుడి లేదా ఎడమవైపు అద్దం ఉంచితే శుభ శక్తిని ఆకర్షించగలదు.
డైనింగ్ రూమ్‌లో అద్దం ఉన్నచో...
డైనింగ్ టేబుల్ ప్రతిబింబించేలా అద్దం ఉంచితే ఆహారంతో పాటు సంపద కూడా వృద్ధి చెందుతుందని నమ్మకం. అతిథులకు కూడా ఆ గది ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
టాయిలెట్, స్టడీ రూమ్‌లో అద్దాలకు నియమాలు టాయిలెట్‌లో అద్దం తలుపుకు నేరుగా కాకుండా పశ్చిమం లేదా దక్షిణ గోడపై ఉండాలి. స్టడీ రూమ్‌లో అద్దం నేరుగా ముందుండకూడదు. అది ఏకాగ్రతను చెడగొడుతుందని చెబుతున్నారు.
పగిలిన అద్దాలు, మురికి అద్దాలు
పగిలిన అద్దాలు, మురికి అద్దాలు – తక్షణమే తొలగించాలి పగిలిన అద్దాలు దురదృష్టానికి సంకేతమని, మురికిగా ఉండే అద్దాలు చెడు శక్తులను ఆకర్షిస్తాయని నమ్మకం. అవి ఎప్పటికప్పుడు శుభ్రంగా మెరిసేలా ఉంచాలి.
ఆకారాలు, దృశ్యాలు కూడా ప్రభావం చూపిస్తాయి చతురస్రాకార అద్దాలు మంచివి. పదునైన అంచులు ఉండకూడదు. అద్దంలో పూలు, ప్రకృతి, శుభ దృశ్యాలు కనిపిస్తే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.
కుబేర దిశలో డబ్బు పెట్టె
కుబేర దిశలో డబ్బు పెట్టె – అదృష్టానికి మార్గం ఉత్తర దిశలో డబ్బు పెట్టె కనిపించేలా అద్దం ఉంచితే ధనం పెరుగుతుందని ప్రజల నమ్మకం.
ఆనందం, సంపద కోసం
ఈ సూచనలు శాస్త్రీయంగా కాకపోయినా, మన పూర్వీకులు తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారు. ఇంట్లో శాంతి, ఆనందం, సంపద కోసం వాస్తు చిట్కాలను సరళంగా పాటించడం మంచిదే. అద్దాలను శ్రద్ధగా ఉంచితే, అవి శక్తిని ఆకర్షించే సాధనాలుగా మారతాయి.