- Home
- Astrology
- Vastu Tips: కెరీర్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా ? అయితే ఆఫీస్ బ్యాగ్ నుంచి ఈ వస్తువులను తీసేయండి
Vastu Tips: కెరీర్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా ? అయితే ఆఫీస్ బ్యాగ్ నుంచి ఈ వస్తువులను తీసేయండి
Vastu Tips for Office Bag: ప్రతి ఒక్కరికి తమ కెరీర్ లో సక్సెస్ కావాలని కోరుకుంటారు. కానీ, అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆఫీస్ బ్యాగ్‌లో కొన్ని వస్తువులను ఉంచుకోవడం వల్ల పురోగతికి ఆటంకం కలుగుతుందట. ఇంతకీ ఆ వస్తువులేంటీ ?

ఎంతో కష్టపడి ఫలితం లేదా?
ప్రతి ఒక్కరికి తమ కెరీర్ లో సక్సెస్ కావాలని ఉంటుంది. అందుకోసం తగ్గట్టు తమ వంతు కృషి చేస్తారు.పదోన్నతి కోసం, జీతం పెంపు కోసం ఎంతో కష్టపడుతారు. కానీ, అందరూ తమ కెరీర్ లో సక్సెస్ కాలేరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. వారు చేసే కొన్ని తప్పులు వారి పురోగతికి అడ్డంకులుగా మారుతాయంట.
సక్సెస్ కు అడ్డంకులు
వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఆఫీసుకు తీసుకెళ్లే బ్యాగులో ఈ వస్తువులుంటే.. మీ సక్సెస్ ను అడ్డుకుంటాయట. వెంటనే ఆ వస్తువులను తీసివేసేయండి. ఇంతకీ ఆ వస్తువులేంటీ?
మహిళల బ్యాగ్‌లో
మహిళలు తమ బ్యాగ్‌లో లిప్‌స్టిక్, మస్కారా, ఆభరణాలు, పెర్ఫ్యూమ్, డియోడరెంట్స్ ఉంచుకుంటారు. అలాగే కొంతమంది నెయిల్ కట్టర్, చిన్న కత్తి వంటివి ఉంటాయి.
కత్తి, పదునైన వస్తువులు
వాస్తు ప్రకారం.. కత్తి, నెయిల్ కట్టర్ లాంటి పదునైన వస్తువులను ఆఫీస్ బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిది కాదు. ఇది ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. వీటి ప్రభావంతో సహోద్యోగులతో రిలేషన్‌షిప్ దెబ్బతినవచ్చు. కెరియర్‌లో ఆటంకాలు రావచ్చు. కాబట్టి వాటిని వెంటనే మీ బ్యాగ్ నుంచి తీసేయండి.
వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులు
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఆఫీస్ బ్యాగ్ లో ఎలాంటి వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులను ఉంచకూడదు. కొంతమంది దువ్వెన, టూత్ బ్రష్ వంటి ఎన్నో వస్తువులు పెట్టుకుంటారు. మరికొందరూ సబ్బు, పెర్ఫ్యూమ్, డియోడరెంట్స్ వంటివి కూడా పెట్టుకొని తీసుకెళ్తారు. ఇలాంటి వాటి నుండి నెగిటివ్ ఎనర్జీ విడుదలవుతుంది. తద్వారా మీ కెరీర్‌ను ముందుకు సాగదు.
మురికి బట్టలు
కొంతమంది ఆఫీస్ బ్యాగ్ లో మాసిపోయిన బట్టలు, మురికి బట్టలను కూడా క్యారీ చేస్తారు. ఆఫీసులో డ్రెస్ మార్చుకొని, విప్పిన బట్టలను ఆఫీస్ బ్యాగులో పెడుతూ ఉంటారు. మురికి బట్టలు ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయి. దీనివల్ల మీలో చిరాకు, కోపం, అలసట వంటివన్నీ పెరిగిపోతాయని చెబుతున్నారు.
అనవసరమైన కాగితాలు
కొంతమంది తన ఆఫీస్ బ్యాగ్ లో పాత టిక్కెట్లు, అనవసరమైన కాగితాలు, అవసరం లేని విస్టింగ్ కార్డులు, పాత బిల్లులు, డ్యాకుమెంట్స్ వంటివి ఆఫీస్ బ్యాగ్ పెట్టుకుంటారు. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. ఇలాంటి అనవసరమైన వస్తువులు ఉంటే వెంటేనే వాటిని మీ బ్యాగ్ నుంచి తీసేయండి.