Vastu Tips for Money: డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!
ప్రతి ఒక్కరి జీవితం డబ్బుతో ముడిపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే డబ్బుకు సంబంధించిన కొన్ని తప్పులు చేస్తే.. జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ తప్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే..
లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. జీవితంలో ఎప్పుడూ వారికి డబ్బు కొరత రాదు. వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నంత కాలం వారి సిరి, సంపదలు పెరుగుతూనే ఉంటాయి.
అందుకే జీవితంలో ఐశ్వర్యం, సంపద కలగాలని అందరు విష్ణు, లక్ష్మీదేవిలను ప్రతిరోజూ పూజిస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం.. లక్ష్మీదేవికి మనపై కోపం వస్తే.. జీవితంలో ఆర్థిక సమస్యలు తప్పవట. మరి లక్ష్మీదేవికి ఎందుకు కోపం వస్తుందో ఇక్కడ చూద్దాం.
వాస్తు ప్రకారం..
వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బుకు సంబంధించిన కొన్ని తప్పులు చేస్తే.. లక్ష్మీదేవి కోపానికి గురికావాల్సి వస్తుందట. జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఆ తప్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఉమ్మితో డబ్బు లెక్కించకూడదు:
చాలామంది నోటి దగ్గర తడి తీసుకొని డబ్బులను లెక్కిస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బును ఉమ్మితో లెక్కించకూడదు. ఇది లక్ష్మీదేవిని అవమానించడమే కాకుండా, ఆమెకు కోపం తెప్పిస్తుందట. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట.
డబ్బును మడత పెట్టకూడదు:
చాలామంది డబ్బులను మడత పెడుతూ ఉంటారు. కానీ వాస్తుప్రకారం డబ్బును అస్సలు మడతపెట్టకూడదట. ఇది కూడా లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
డబ్బును ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు:
కొంతమంది డబ్బును ఎక్కడపడితే అక్కడ పెడతుంటారు. వాస్తు ప్రకారం అలా చేయడం చాలా తప్పు. ఇది కూడా లక్ష్మీదేవిని అవమానించడమే. దీనివల్ల చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
డబ్బుతో పాటు ఇతర వస్తువులను పెట్టకూడదు:
వాస్తు ప్రకారం.. డబ్బు పెట్టే చోట ఇతర అనవసర వస్తువులను పెట్టకూడదు. ఉదాహరణకు.. పర్సులో డబ్బుతో పాటు ఏదైనా బిల్లులను ఉంచుతారు. ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
తల దగ్గర డబ్బు పెట్టుకోకూడదు:
చాలామంది రాత్రి పడుకునేటప్పుడు బెడ్ కింద లేదా దిండు కిందా పర్స్ లేదా డబ్బులు పెట్టుకొని పడుకుంటారు. వాస్తు ప్రకారం తల దగ్గర పర్సు లేదా డబ్బు పెట్టుకుని పడుకోకూడదట. దానివల్ల దురదృష్టం వెంటాడుతుందట. డబ్బు పెట్టే చోట మాత్రమే.. డబ్బును ఉంచితే అదృష్టం కలిసివస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.