MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Vastu Tips: కిచెన్ లో స్టవ్ పక్కన ఇవి ఉంటే..ఇంట్లో డబ్బు నిలవదు..!

Vastu Tips: కిచెన్ లో స్టవ్ పక్కన ఇవి ఉంటే..ఇంట్లో డబ్బు నిలవదు..!

 Vastu Tips: వాస్తు మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. తెలిసీ తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు మన ఆర్థిక జీవితాన్ని దెబ్బతీస్తాయి. అందుకే, కొన్ని మార్పులు కచ్చితంగా చేసుకోవాలి.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 09 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Vastu Tips
Image Credit : storyblocks

Vastu Tips

వంటగది అనేది ఇంటికి గుండె లాంటిది. మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. ఆ కిచెన్ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. కిచెన్ అంటే కేవలం వంట చేసే ప్లేస్ అని చాలా మంది భావిస్తారు. కానీ.. ఇంటి ఆర్థిక స్థితిని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రదేశం అది. వాస్తు ప్రకారం..స్టవ్ పక్కన పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఉంచకూడదట. వాటి కారణంగా.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి.. ఆర్థికంగా ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరి, ఎలాంటివి ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింక్...
Image Credit : Getty

సింక్...

సింక్, నీటి కుండ...

వాస్తు శాస్త్రం ప్రకారం స్టవ్ అనేది అగ్నికి సంకేతం. నీరు, అగ్ని ఒకదానికి మరొకటి విరుద్ధమైన శక్తులు కలిగి ఉంటాయి. స్టవ్ పక్కనే సింక్ లేదా.. నీటి కుండ ఉండే.. అగ్ని-జల తత్వాల ఘర్షణ వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. కిచెన్ లో సింక్ లేకుండా ఎలా ఉంటుంది అనే అనుమానం మీకు రావచ్చు. అయితే.. మరీ స్టవ్ పక్కనే ఉండకూడదు. కనీసం 2 నుంచి 3 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. అలా వీలు కాని సమయంలో ఒక చెక్క ముక్క లేదా చిన్న అడ్డుగోడ లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్య రాదు.

Related Articles

Related image1
Birth Date: ఇంటి మొదటి సంతానం ఈ తేదీల్లో పుడితే.. వాళ్లు కుబేరులు కావడం పక్కా
Related image2
Birth Date: మీరు పుట్టిన తేదీ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?
34
కిచెన్ లో ఇవి కూడా ఉండకూడదు..
Image Credit : freepik

కిచెన్ లో ఇవి కూడా ఉండకూడదు..

చీపురు...

స్టవ్ దగ్గర మాత్రమే కాదు.. కిచెన్ లో అసలు చీపురు ఉండకూడదు. చీపురు అనేది ఇంటిని శుభ్రం చేస్తుంది. కానీ, అది దరిద్రానికి సంకేతంగా భావిస్తారు. అన్నపూర్ణాదేవి కొలువై ఉండే కిచెన్ లో చీపురు పెడితే.. ఇంట్లో ధనం నిలవదు. అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ పొరపాటు చేయకూడదు.

3.మెడిసిన్ బాక్స్...

చాలా మంది తమ సౌలభ్యం కోసం.. మందులను కిచెన్ లో ఉంచుతారు. కానీ, వాస్తు ప్రకారం ఇది చాలా పెద్ద పొరపాటు. కిచెన్ లో మందులు పెట్టడం వల్ల ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉంటారు. వంట గదిలోని పాజిటివ్ ఎనర్జీని మందులు గ్రహించి.. నెగిటివ్ ఎనర్జీని విడుదల చేస్తాయి.

44
 4.డస్ట్ బిన్...
Image Credit : gemini ai

4.డస్ట్ బిన్...

చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఇది. కిచెన్ లో డస్ట్ బిన్ ఉంచడం వాస్తు ప్రకారం చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల రాహు-శని ప్రభావం పెరిగి, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు పెరుగుతాయి. ఇది ఇంటి అభివృద్ధిని అడ్డుకుంటుంది.

5. పగిలిన లేదా విరిగిన సామాన్లు (Broken Items)

విరిగిన ప్లాస్టిక్ డబ్బాలు, పగిలిన గాజు గ్లాసులు లేదా పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను స్టవ్ చుట్టుపక్కల ఉంచకండి.

పగిలిన వస్తువులు దరిద్రానికి సంకేతం. ఇవి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయి. మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి.

వాస్తు ప్రకారం కొన్ని ముఖ్యమైన సూచనలు:

దిశ: కిచెన్ స్టవ్ ఎప్పుడూ ఆగ్నేయ మూల (South-East) ఉండాలి.

వంట చేసే దిశ: వంట చేసేటప్పుడు ముఖం తూర్పు వైపు (East) ఉండేలా చూసుకోవాలి. ఇది ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి చాలా మంచిది.

శుభ్రత: రాత్రి పడుకునే ముందు స్టవ్ , కిచెన్ ప్లాట్‌ఫారమ్‌ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. మురికిగా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Birth Date: ఇంటి మొదటి సంతానం ఈ తేదీల్లో పుడితే.. వాళ్లు కుబేరులు కావడం పక్కా
Recommended image2
Birth Date: మీరు పుట్టిన తేదీ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved