MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Vastu Tips: ఇంట్లో ఈ పెయింటింగ్స్ ఉంటే చాలు, అదృష్టం పెరిగి.. డబ్బుకు లోటు ఉండదు..!

Vastu Tips: ఇంట్లో ఈ పెయింటింగ్స్ ఉంటే చాలు, అదృష్టం పెరిగి.. డబ్బుకు లోటు ఉండదు..!

Vastu Tips: వాస్తు శాస్త్రం మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. మనం ఇంటి వాస్తు చూసుకుంటే సరిపోదు. ఇంట్లో చిన్నచిన్న వాస్తు మార్పులు చేసుకుంటే అదృష్టం రెట్టింపు అవుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 26 2026, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Vastu Tips
Image Credit : Asianet News

Vastu Tips

వాస్తు శాస్త్రం ప్రకారం, మన ఇంట్లోని గోడలపై అలంకరించే చిత్ర పటాలకు కేవలం అందాన్ని ఇవ్వడమే కాకుండా, మన జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి కూడా ఉంటుంది. సరైన దిశలో, సరైన చిత్రపటాన్ని ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడమే కాకుండా, అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. మరి, అవేంటో చూద్దామా...

23
1.ఏడు గుర్రాల చిత్రం...
Image Credit : Freepik

1.ఏడు గుర్రాల చిత్రం...

వాస్తు ప్రకారం అత్యంత శక్తివంతమైన చిత్రాలలో ఏడు గుర్రాల చిత్రం ఒకటి. పరిగెడుతున్న ఏడు గుర్రాలు విజయం, వేగం, పురోగతికి చిహ్నం.

దీనిని ఇంట్లో ఉంచడం వల్ల వ్యాపారంలో వృద్ధి, కెరీర్ లో ప్రమోషన్, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. దీనిని ఇంటి తూర్పు గోడపై లేదా ఆఫీసులో మీ వెనక భాగంలో ఉండేలా అమర్చాలి. గుర్రాలు ఇంటి లోపలికి వస్తున్నట్లుగా ఉండాలి.

2.జలపాతం లేదా ప్రవహించే నీరు..

నీరు సంపదకు, ప్రశాంతతకు చిహ్నం. ప్రవహించే నీటి చిత్రం ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఇలాంటి చిత్ర పటాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఈ చిత్ర పటాన్ని దీనిని ఎల్లప్పుడూ ఈశాన్యం లేదా ఉత్తర దిశ గోడలకు తగిలించాలి. నీరు ఇంటి లోపలి వైపు ప్రవహిస్తున్నట్లు ఉండాలి.

3.ఉదయించే సూర్యుడు..

సూర్యుడు ఆరోగ్యం, శక్తి, ఆత్మవిశ్వాసానికి మూలం. ఉదయించే సూర్యుని చిత్రం మనసులో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో వ్యక్తుల్లో చురుకుదనం పెరుగుతుంది. దీనిని కచ్చితంగా తూర్పు దిశ గోడపైనే ఉంచాలి.

Related Articles

Related image1
Vastu Tips: పడుకునే ముందు బెడ్ పక్కన వాటర్ బాటిల్ పెట్టుకునే అలవాటు ఉందా?
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏం చేసినా విజయం వరిస్తుంది..!
33
4.పచ్చని ప్రకృతి లేదా అడవి..
Image Credit : Getty

4.పచ్చని ప్రకృతి లేదా అడవి..

పచ్చని ప్రకృతి దృశ్యాలు వృద్ధికి , కొత్త అవకాశాలకు సూచన. ఇలాంటి పెయింటింగ్, లేదా ఫోటోని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలను పెంచుతుంది. ఇలాంటి పెయింటింగ్ ని పిల్లల గదిలో ఉంచితే వారి ఏకాగ్రత పెరుగుతుంది. ఇలాంటి పెయింటింగ్ ని ఉత్తర దిశలో ఉంచడం వల్ల శుభాలు కలుగుతాయి.

5.హంసల జంట..

బెడ్ రూమ్ లో అలంకరించుకోవడానికి ఇది అత్యంత ఉత్తమమైన చిత్రం. ఇలాంటి ఫోటో ఇంట్లో ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరగడానికి దాంపత్య జీవితంలో గొడవలు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఇలాంటి ఫోటో ఇంట్లో బెడ్రూమ్ లో నైరుతి దిశ గోడపై ఉంచాలి.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం...

హింసాత్మక చిత్రాలు వద్దు: యుద్ధం, ఏడుస్తున్న మనుషులు, ముళ్ల మొక్కలు లేదా క్రూర మృగాల చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి.

విరిగిన ఫ్రేములు: పగిలిన గాజు లేదా విరిగిపోయిన ఫ్రేములు ఉన్న చిత్రపటాలను వెంటనే తొలగించాలి.

పరిశుభ్రత: గోడలపై ఉండే చిత్రాలపై దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి, లేదంటే అది అదృష్టాన్ని అడ్డుకుంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Moon Conjuction: గురు చంద్రుల కలయికతో గజకేసరి యోగం, ఈ 5 రాశులదే అదృష్టమంతా
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితం పొందుతారు!
Recommended image3
AI Horoscope: ఓ రాశివారు ఈరోజు శత్రువులపై విజయం సాధిస్తారు
Related Stories
Recommended image1
Vastu Tips: పడుకునే ముందు బెడ్ పక్కన వాటర్ బాటిల్ పెట్టుకునే అలవాటు ఉందా?
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏం చేసినా విజయం వరిస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved