Plants Vastu tips: ఈ మొక్కలను పొరపాటున కూడా ఇంట్లో పెంచకూడదు! ఎందుకో తెలుసా?
ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకునేందుకు చాలామంది మొక్కలు పెంచుతూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో, ఇంటి చుట్టూ పెంచడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆ మొక్కలేంటో చూద్దాం.
- FB
- TW
- Linkdin
- GNFollow Us

ఏ మొక్కలను ఇంట్లో పెంచకూడదు?
వాస్తు శాస్త్రంలో ప్రతికూల, సానుకూల శక్తులకు చాలా ప్రాధాన్యం ఉంది. వాస్తు ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదట. వాటిలో మొదటిది చింత చెట్టు. ఈ చెట్టు ప్రతికూల శక్తులను ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతికూల శక్తుల వల్ల ఇంట్లో దుఃఖం, పేదరికం పెరుగుతాయి. కాబట్టి ఇళ్లలో చింత చెట్టును నాటడం మానుకోవాలి. చింత చెట్టు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఇళ్లను కూడా కొనకూడదని నిపుణులు చెబుతున్నారు.
రావి చెట్టు, మారేడు చెట్టు
రావి చెట్టు చాలా పవిత్రమైనది. కానీ దాన్ని ఇంట్లో పెంచడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అది ఇంట్లో ఉన్నవారి మనశ్శాంతిని చెడగొడుతుంది. అంతేకాదు.. ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. దాని వేర్లు గోడలపైకి పాకితే ఇల్లు దెబ్బతింటుంది. మారేడు చెట్టు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కానీ దాన్ని కూడా ఇంట్లో పెంచడం మంచిది కాదు. ఇది ఇంట్లో ఉన్నవారి ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. మారేడు చెట్టు దేవాలయాల్లో మాత్రమే ఉండాలి. దీన్ని ఇళ్లలో పెంచడం మంచిదికాదు.
నేరేడు చెట్టు, అత్తి చెట్టు
నేరేడు చెట్టును ఇంట్లో పెంచకూడదని చెప్పడానికి కారణం అది చాలా చల్లని స్వభావం కలిగిన చెట్టు. ఇది విష జీవాలను ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ చెట్టు వల్ల అవి ఇంట్లోకి వస్తాయి కాబట్టి ఈ చెట్టును ఇంటి చుట్టూ పెంచకూడదని పెద్దలు చెబుతారు. అత్తిపండు పక్షులకు చాలా ఇష్టమైనది. ఈ పండ్ల కోసం గబ్బిలాలు అత్తి చెట్టును వెతుక్కుంటూ వస్తాయట. గబ్బిలాల వల్ల చాలా వ్యాధులు వస్తాయి కాబట్టి అత్తి చెట్టును కూడా ఇంటి చుట్టూ పెంచకూడదని పెద్దలు చెబుతారు.
కరివేపాకు, ఇతర చెట్లు
ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది మగపిల్లలు ఉంటే కరివేపాకు చెట్టును పెంచవచ్చు. లేకపోతే ఈ చెట్టును పెంచకూడదట. అలా పెంచితే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని.. జీవితంలో కష్టం వస్తుందని చెబుతారు. ఈ చెట్లతో పాటు, పనస, తాటి, రేగు చెట్టు వంటి వాటిని, కలబంద వంటి ముళ్ల మొక్కలను కూడా ఇంట్లో పెంచకూడదట. ఇవి ఇంట్లో దురదృష్టాన్ని పెంచుతాయని చెబుతారు.
పెంచాల్సిన చెట్లు
ఇంట్లో చెట్లు పెంచాలనుకుంటే.. మామిడి, జామ, అరటి, కొబ్బరి వంటి వాటిని పెంచవచ్చు. ఎప్పుడూ సువాసన వెదజల్లే బంతి, గులాబీ మొక్కలను పెంచవచ్చు.