లవంగాలు వంటకాలకు రుచిని పెంచడమే కాదు.. అనేక జ్యోతిష్య పరిహారాల్లో కూడా ఉపయోగపడతాయి. ఎలాగో ఇక్కడ చూద్దాం.
Image credits: Getty
Telugu
ఇంట్లో డబ్బు నిల్వ ఉండాలంటే..
శుక్రవారం నాడు 11 లవంగాలను లక్ష్మీదేవి పూజలో పెట్టి.. ఆ తర్వాత వాటిని ఎర్రటి వస్త్రంలో కట్టి డబ్బు పెట్టెలో ఉంచాలి. దానివల్ల ఇంట్లో డబ్బు అకస్మాత్తుగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
నరదిష్టి ఉన్నవారు..
నరదిష్టి ఉన్నవారు రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద 5 లవంగాలను పెట్టుకొని.. మరుసటి రోజు ఉదయం వాటిని కాల్చాలి. దీనివల్ల దిష్టి వెంటనే తొలగిపోతుందట.
Image credits: Getty
Telugu
ప్రతికూలశక్తి ఉంటే..
ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని మీరు భావిస్తే.. 11 లవంగాలను కాల్చి, వాటి పొగను ఇల్లంతా వ్యాపింపజేయాలి. దానివల్ల సమస్య తొలగిపోతుందట.
Image credits: Getty
Telugu
జేబులో డబ్బు ఉండాలంటే..
జేబులో డబ్బు వచ్చింది వచ్చినట్లే పోతుంటే.. 2 లవంగాలను లక్ష్మీదేవికి సమర్పించి.. ఆ తర్వాత వాటిని పర్సులో ఉంచుకోవాలి. దానివల్ల మీ జేబులో డబ్బు నిలుస్తుందట.
Image credits: Getty
Telugu
శని దేవుని అనుగ్రహం
మీ జాతకంలో శని స్థానం బాగోలేకపోతే లవంగాలను రుబ్బి.. రోజూ మీ నుదుటిపై తిలకంగా పెట్టుకోండి. దానివల్ల శనిదేవుని అనుగ్రహం దక్కుతుందట.