MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారికి తొందర ఎక్కువ.. అదే వారి కొంపముంచుతుంది!

Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారికి తొందర ఎక్కువ.. అదే వారి కొంపముంచుతుంది!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రం మన స్వభావం, ఆలోచనా విధానం, నిర్ణయశైలిపై ప్రభావం చూపుతుంది. కొన్ని నక్షత్రాల్లో జన్మించినవారు వేగం, ఆత్రుత, వెంటనే స్పందించే స్వభావం కలిగి ఉంటారు. దానివల్ల కొన్నిసార్లు నష్టాలు తప్పవని పండితులు చెబుతున్నారు. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 17 2026, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Birth Stars Astrology
Image Credit : AI Generated

Birth Stars Astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నక్షత్రానికి ప్రత్యేక స్వభావం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారిలో తొందర, ఆత్రుత ఎక్కువగా కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. ఆ తొందరపాటు వల్ల వారికి లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వస్తాయని సూచిస్తున్నారు. మరి ఆ నక్షత్రాలేంటో తెలుసుకుందామా..

26
అశ్విని నక్షత్రం
Image Credit : Getty

అశ్విని నక్షత్రం

అశ్విని నక్షత్రంలో జన్మించినవారికి వేగం, చురుకుదనం, వెంటనే స్పందించే గుణం సహజంగా ఉంటాయి. వీరు ఏ పని అయినా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ స్వభావం గొప్ప ఫలితాలు ఇస్తుంది. కానీ పూర్తి వివరాలు తెలుసుకోకుండా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం వీరి ప్రధాన లోపం. పెట్టుబడులు, ఉద్యోగ మార్పులు, వివాహ నిర్ణయాలు వంటి కీలక విషయాల్లో ఆత్రుత వల్ల నష్టాలు ఎదుర్కొంటారు.

Related Articles

Related image1
Lucky Zodiac Signs: ఒకటి కాదు రెండు కాదు 12 శుభ యోగాలు, 4 రాజయోగాలు.. ఈ 3 రాశులవారి పంట పండినట్లే!
Related image2
Dream Astrology: కలలో ఈ జంతువులు కనిపిస్తే.. అదృష్టం, సంపద మీ సొంతం అయినట్లే !
36
మృగశిర నక్షత్రం
Image Credit : Getty

మృగశిర నక్షత్రం

మృగశిర నక్షత్ర జాతకులు ఎప్పుడూ ఏదో ఒకటి అన్వేషిస్తూనే ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అన్వేషణ తత్వం వల్ల ఒక నిర్ణయంపై స్థిరంగా ఉండలేరు. తొందరగా ఒక పని మొదలుపెట్టి, మరొక అవకాశం కనిపిస్తే దానివైపు మళ్లిపోవడం వీరి లక్షణం. ఈ చంచలత్వం వల్ల వృత్తి, వ్యాపార రంగాల్లో స్థిరత్వం దెబ్బతింటుంది.

46
ఆరుద్ర నక్షత్రం
Image Credit : Getty

ఆరుద్ర నక్షత్రం

ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు చాలా ఎమోషనల్ పర్సన్స్. కోపం, ఆనందం, బాధ ఏ ఫీలింగ్ అయినా వెంటనే బయటపడుతుంది. తొందరగా స్పందించడం, ఆలోచించకుండా మాట్లాడటం వల్ల మాటల్లో కఠినత్వం రావచ్చు. ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లో చీలికలు వస్తాయి. వీరు ముఖ్యమైన నిర్ణయాలను త్వరగా తీసుకోవడం వల్ల నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

56
మఖ నక్షత్రం
Image Credit : Getty

మఖ నక్షత్రం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మఖ నక్షత్రంలో జన్మించినవారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. తమ ఆలోచనలపై బలమైన నమ్మకం పెట్టుకుంటారు. కానీ ఈ విశ్వాసం కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలకు దారి తీస్తుంది. ఇతరుల సలహా తీసుకోకుండా ముందుకు సాగితే సమస్యలు తలెత్తవచ్చు. ఈ నక్షత్రంలో పుట్టినవారు పెద్దల మాట వినడం, నిర్ణయాన్ని సమీక్షించడం అలవాటు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

66
విశాఖ నక్షత్రం
Image Credit : our own

విశాఖ నక్షత్రం

విశాఖ నక్షత్ర జాతకులు లక్ష్యసాధనలో దూకుడుగా ఉంటారు. ఒకసారి నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు వెనకడుగు వేయరు. అయితే ఈ దూకుడు కొన్నిసార్లు తొందరపాటు ఒప్పందాలు, సంబంధాల్లో ఇబ్బందులకు దారి తీస్తుంది. వ్యాపార భాగస్వామ్యాలు, వివాహ నిర్ణయాలు వంటి విషయాల్లో సమగ్ర పరిశీలన అవసరం. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని రెండు కోణాల్లో విశ్లేషించాలని పండితులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Transit: రేవతి నక్షత్రంలోకి శుక్ర సంచారం...మార్చిలో ఈ రాశులకు ఆర్థిక లాభాలు రెట్టింపు
Recommended image2
Solar Eclipse: ఈ ఒక్క రాశి వారిపైనే సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ, నెలపాటు జాగ్రత్త తప్పదు
Recommended image3
AI Horoscope: ఈ రోజు ఓ రాశివారికి గ్రహణ ప్రభావంతో సమస్యలు
Related Stories
Recommended image1
Lucky Zodiac Signs: ఒకటి కాదు రెండు కాదు 12 శుభ యోగాలు, 4 రాజయోగాలు.. ఈ 3 రాశులవారి పంట పండినట్లే!
Recommended image2
Dream Astrology: కలలో ఈ జంతువులు కనిపిస్తే.. అదృష్టం, సంపద మీ సొంతం అయినట్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved