MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్, ఎవరి మీదా ఆధారపడరు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్, ఎవరి మీదా ఆధారపడరు

Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని నిర్దిష్ట తేదీల్లో జన్మించిన మహిళలకు పుట్టుకతోనే అంకిత భావం, స్వతంత్ర భావాలు, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరిపైనా ఆధారపడరు. ఆ తేదీలేంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 21 2026, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెంబర్ 1..
Image Credit : Asianet News

నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ. కెరీర్ పరంగా వీరు ఉన్నత స్థాయికి వెళతారు. వ్యాపారవేత్తలుగా, ఉన్నతాధికారులుగా రాణించగలరు. ప్రపంచానికి తామేంటో నిరూపించుకోవాలనే పట్టుదల వీరిలో ఉంటుంది.

24
నెంబర్ 9..
Image Credit : Asianet News

నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పోరాట యోధులు అని చెప్పొచ్చు. వీరు ఎన్ని కష్టాలు ఎదురైనా కొంచెం కూడా బెదరరు. కష్టం ఎదురైనా ఏ మాత్రం భయపడకుండా ముందుకు వెళతారు. వీరికి ఇండిపెండెంట్ గా ఉండటం అంటే ఇష్టం. ఏ విషయంలోనూ ఇతరుల సహాయం తీసుకోవడం వీరికి నచ్చదు. అన్యాయాన్ని ఎదురించే గుణం వీరిలో పుట్టుకతోనే ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు రాజకీయాలు, పోలీసు, డిఫెన్స్ లేదా క్రీడా రంగంలో బాగా రాణించగలరు.

Related Articles

Related image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు..!
Related image2
Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారు స్వయం కృషితో కోటీశ్వరులు అవుతారు..!
34
నెంబర్ 5...
Image Credit : Asianet News

నెంబర్ 5...

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు స్వేచ్ఛా ప్రియులు. అంతేకాదు.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైన వారు. ఎలాంటి నిర్ణయం అయినా వెంటనే తీసుకుంటారు. ఎక్కువ సేపు ఆలోచించరు. వీరికి మార్పు అంటే ఇష్టం. పాత విధానాలకు కట్టుబడి ఉండరు. సమాజం ఏమనుకుంటుందో అనే భయం వీరికి ఉండదు.ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మీడియా, మార్కెటింగ్, ట్రావెల్, టెక్నాలజీ రంగాల్లో మంచి స్థాయికి వెళ్లగలరు.

44
నెంబర్ 8...
Image Credit : Asianet News

నెంబర్ 8...

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సొంతంగా సామ్రాజ్యాలను నిర్మించగలరు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా గంభీరంగా ఉంటారు. వీరు కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో... కష్టాలు ఎదురైనా, తమ పట్టుదలతో కోటీశ్వరులుగా మారతారు. ఆర్థిక స్వతంత్రత కోసం వీరు ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: నవపంచమ రాజయోగం.. ఈ 3 రాశులవారి లైఫ్ అద్భుతంగా మారిపోవడం ఖాయం!
Recommended image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు..!
Recommended image2
Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారు స్వయం కృషితో కోటీశ్వరులు అవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved