ఫుడ్ బాలేకపోతే.. ఏ రాశివారు ఎలా రియాక్టవుతారో తెలుసా...
తినే ఆహారం బాగాలేకపోతే.. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతుంటారు. రెస్టారెంటుకు వెళ్లారనుకో.. తాము అనుకున్నట్టుగా ఫుడ్ డెలీషియస్ గా లేపోతే.. కొందరు చిందులో తొక్కి.. నానా కంగాళీ చేస్తే.. మరికొందరు.. స్వీట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. అయితే ఈ రియాక్షన్ కూడా వారి రాశి ప్రకారమే ఉంటుందట..

మేషరాశి : ‘బాబోయ్.. ఈ ఫుడ్డా నేను తింటుంది.. ఇంత దరిద్రంగా ఉందేంటి’.. అంటూ వెయిటర్ ను గట్టిగా కేకేసి, పిలిచి.. చెఫ్ ను పిలవమని చెబుతారు.
వృషభరాశి : ఫుడ్ దరిద్రంగా ఉందో.. ఏదో రకంగా మింగేయాలి.. ఇంకోసారి ఇక్కడికి రాకూడదు.. ఈ రెస్టారెంటును ఎవ్వరినీ రికమండ్ చేయకూడదు. కుదిరితే వార్న్ చేయాలి కూడా..
మిధునరాశి : చెఫ్ ఏమైనా తాగున్నాడా? ఏంటీ ఈ ఫుడ్.. ఏమనుకుంటున్నాడు నా గురించీ.. ఇవే ఇలా ఉంటే.. డెజర్టులు ఇంకెలా ఉంటాయో..
కర్కాటకరాశి : దీనికన్నా యూ ట్యూబ్ లో చూసి.. ఇంట్లోనే ఏదో ఒకటి వండుకున్నా బాగుండేది. ఈ ఫుడ్ తినలేను..ఇంటికెళ్లాక ఏదో ఒకటి తినాలి.. చెఫ్ కి ఈ రోజు ముడిందే...
సింహరాశి : ఈ ఫుడ్ అస్సలు బాలేదు. ఇంకో ముక్క కూడా తినలేను. పద వెళ్లిపోదాం. మనం దీన్ని వదలేసి వేరే రెస్టారెంట్ కి వెళ్దాం.. మళ్లీ జన్మలో ఇటువైపు రావొద్దు.
కన్యారాశి : దీన్ని ఎలాగోలా మింగేయాలి. మళ్లీ తప్పిదారి కూడా ఇటువైపు రాకూడదు. వృషభరాశి టేస్ట్ ఇలాగే ఏడుస్తుందేమో.. అది గుర్తుపెట్టుకోవాల్సింది.
Libra
తులారాశి : ఇది చాలా దరిద్రంగా ఉంది. నోట్లో పెట్టుకోలేకపోతున్నా.. కానీ అది నా మొహంలో కనిపించకుండా శతవిధాలా ప్రయత్నిస్తాను.
Scorpio Zodiac
వృశ్చికరాశి : ఛీ.. ఇదేం ఫుడ్.. అనుకుంటారు. కొంచెం తినగానే.. బిల్లు తెమ్మని చెప్పి.. కోపంగా కట్టేసి వెళ్లిపోతారు.
ధనుస్సురాశి : ఇంత ఘోరంగా చేశాడు.. చెఫ్ కి ఏమయ్యింది. జీతం సరిగా ఇవ్వడం లేదా. భగవంతుడా ఏంటీ ఫుడ్.. అంటూ విసుక్కుంటారు..
మకరరాశి : ఫుడ్ ను ఏదో రకంగా తినేస్తారు. బిల్లు కడతారు. ఫుడ్ చాలా ఛండాలంగా ఉందని వెయిటర్ కు తెలిసేలా బిహేవ్ చేసి.. ర్యూడ్ గా వెళ్లిపోతారు.
కుంభరాశి : ఇలా నా ఒక్కదానికే అనిపిస్తుందా? అందరిదీ ఇదే ఫీలింగా? ఇది కాకుండా వేరేది ట్రై చేయాల్సిందేమో.. నా డబ్బులు ఇవ్వాల మురిక్కాలువలో పోసినట్టే.
Pisces
మీనరాశి : ఈ ప్లేస్ అంటే నాకు అస్సలు ఇష్టముండదిక.. దీనికంటే బయట దొరికే డబ్బా ఫుడ్డే బాగుంటుంది. కనీసం ఆ కుల్ఫీ తిన్నా బాగుండేదేమో..